తెలంగాణ

telangana

ETV Bharat / business

కండోమ్​, వైన్​ ధరలు పెరిగేది ఇందుకే... - ప్రంప్

సౌందర్య సాధనాలు, కండోమ్​లు, అత్తరు, వైన్​తో పాటు 5,410 అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 5 నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ నిర్ణయం జూన్​ 1 నుంచే అమలు కానున్నట్లు వెల్లడించింది.

వాణిజ్య .యుద్ధం

By

Published : Jun 1, 2019, 4:59 PM IST

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. చైనా దిగుమతులపై అమెరికా సుంకాల పెంపుపై ప్రతి చర్యలకు దిగింది డ్రాగన్​ దేశం. అమెరికా నుంచి వచ్చే సౌందర్య సాధనాలు, కండోమ్​లు, అత్తరు సహా 5,410 ఉత్పత్తులపై సుంకాన్ని 5 నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది.

మొత్తం 60 బిలియన్ డాలర్లు విలువైన ఉత్పత్తులపై సుంకాల వడ్డన జూన్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.

ప్రతి చర్యలకు ప్రధాన కారణాలు ఇవే

అమెరికా-చైనా వాణిజ్య వివాదం అనేక నెలలుగా సాగుతోంది. సమస్య పరిష్కారానికి రెండు దేశాలు ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు... 200 బిలియన్ డాలర్లు విలువైన చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని ఇటీవలే 25శాతానికి పెంచింది అమెరికా.

చైనా టెలికమ్యూనికేషన్​ పరికరాల​ దిగ్గజం హువావే విషయంలోనూ కఠినంగా వ్యవహరించింది ట్రంప్​ సర్కార్​. ఆ సంస్థను బ్లాక్ లిస్ట్​లో చేర్చుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా... హువావేకు సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది గూగుల్.

అమెరికా వరుస ఆంక్షలతో చైనా ప్రతి చర్యలకు దిగింది. స్మార్ట్​ఫోన్​లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్​ ఉపకరణాల తయారీకి ఉపయోగించే అరుదైన లోహాలను అమెరికాకు ఎగుమతి చేయడం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా 5,410 వస్తువులపై సుంకాలు పెంచింది చైనా.

ఇదీ చూడండి: WC19: టీవీల అమ్మకాలు పెంచిన 'క్రికెట్​ ప్రేమ'

ABOUT THE AUTHOR

...view details