తెలంగాణ

telangana

ETV Bharat / business

యాపిల్​కు చైనా తీవ్ర హెచ్చరిక- కారణం ఒక పాట, ఒక యాప్​! - యాపిల్​కు చైనా తీవ్ర హెచ్చరిక

హాంగ్​కాంగ్​లో రవాణా యాప్​ను అందుబాటులోకి తీసుకురావటంపై యాపిల్​ సంస్థను తప్పుబట్టింది చైనా. ప్రజాస్వామ్య ఉద్యమకారులకు మద్దతుగా నిలుస్తోందని ఆరోపించింది. ఈ నిర్ణయంతో ఆ సంస్థ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది.

యాపిల్​కు చైనా తీవ్ర హెచ్చరిక

By

Published : Oct 9, 2019, 2:03 PM IST

హాంగ్​కాంగ్​ ప్రజాస్వామ్య ఉద్యమకారులకు యాపిల్​ సంస్థ మద్దతుగా నిలుస్తోందని ఆరోపించింది చైనా. ఇలాంటి నిర్లక్ష్యపు వైఖరితో అమెరికా టెక్​ దిగ్గజం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది.

యాపిల్​ స్టోర్​లో 'హెచ్​కే మ్యాప్​.లైవ్​' రవాణా యాప్​ను అందుబాటులో ఉంచటంపై కమ్యూనిస్ట్​ పార్టీ పత్రిక పీపుల్స్​ డైలీలో సంపాదకీయం ప్రచురించింది. హాంగ్​కాంగ్​లో పోలీసుల జాడను నిరసనకారులు గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతోందని ఆరోపించింది.

"ఈ యాప్​కు యాపిల్​ సంస్థ ఆమోదం తెలపటం వల్ల నిరసనకారులకు సహాయపడుతోంది. యాపిల్​ సంస్థ అల్లరి మూకలకు అండగా ఉండాలని అనుకుంటోందా?"
- పీపుల్స్​ డైలీ సంపాదకీయం

హాంగ్​కాంగ్​ స్వాతంత్య్రాన్ని సూచించే పాట.. దక్షిణ చైనా నగరంలోని యాపిల్​ మ్యూజిక్​ స్టోర్​లో కనిపించిందని, దానిపైనా హెచ్చరికలు చేసినట్లు పేర్కొంది పీపుల్స్ డైలీ. హాంగ్​కాంగ్​ వ్యవహారంలోకి యాపిల్​ను లాగడానికి ఎవరూ ఇష్టపడరని తెలిపింది. కానీ ఆ సంస్థ వ్యాపారాన్ని రాజకీయాలతో మిళితం చేస్తోందని, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని ప్రజలు అనుకుంటున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: ట్రంప్ అభిశంసనకు సహకరించబోం: శ్వేతసౌధం

ABOUT THE AUTHOR

...view details