దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్‌పై నియంత్రణ చర్యలను చైనా ముమ్మరం చేసింది. యాంటీ మోనోపలి(గుత్తాధిపత్య వ్యతిరేక) దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు చైనా మార్కెట్ రెగ్యులేటరీ తెలిపింది. 'రెండింటిలో ఒకటి ఎంపిక చేసుకో' అనే సంస్థ విధానంపైనా దృష్టిసారించినట్లు తెలిపింది. అయితే దర్యాప్తు కాలక్రమం సహా సంస్థపై జరిమానాలు విధించే అంశంపై వివరాలు వెల్లడించలేదు.
అలీబాబా గ్రూప్‌పై చైనా రెగ్యులేటరీ దర్యాప్తు - యాంటీ మోనోపలి చైనా
అలీబాబా సంస్థపై ఒత్తిడి పెంచుతోంది చైనా. సంస్థ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా చర్యలు ముమ్మరం చేసింది. ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు చైనా రెగ్యులేటరీ వెల్లడించింది.
అలీబాబా గ్రూప్
ఇదివరకే అలీబాబాకు చెందిన యాంట్ గ్రూప్‌పై చైనా నియంత్రణ సంస్థ కొరడా ఝుళిపించింది. స్టాక్ మార్కెట్లో నమోదు కాకుండా అడ్డుకుంది.
దేశంలో గుత్తాధిపత్యాన్ని తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని చైనా నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇదే ప్రాధాన్య అంశంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలీబాబా సంస్థపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.