తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉద్యోగం నుంచి తప్పించడంపై కోర్టుకు చందా కొచ్చర్

తన ఉద్యోగం తొలగించడం సహా.. బోనస్​లు వెనక్కి ఇవ్వాలన్న ఐసీఐసీఐ బ్యాంక్​ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు ఆ సంస్థ మాజీ సీఈఓ చందా కొచ్చర్​. బాంబే హై కోర్టు డిసెంబర్​ 2న ఈ అంశంపై వాదనలు విననుంది.

koche
చందాకొచ్చర్​

By

Published : Nov 30, 2019, 3:00 PM IST

ఐసీఐసీఐ బ్యాంక్​ వ్యవహారంపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు.. సంస్థ మాజీ సీఈఓ చందా కొచ్చర్​. తనను ఉద్యోగం నుంచి తొలగించడం సహా.. 2009 నుంచి 2018 మధ్య ఇచ్చిన బోనస్​లు, స్టాక్​లు వెనక్కి తీసుకోవాలని ఐసీఐసీఐ బ్యాంకు నిర్ణయించిన నేపథ్యంలో.. ఆమె కోర్టును ఆశ్రయించారు.

జస్టిస్‌ రంజిత్‌ మోరే, జస్టిస్‌ మకరంద్‌ కార్నిక్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం డిసెంబర్‌2వ తేదీన వాదనలు విననుంది.

వివాదం ఇలా..

వీడియోకాన్‌ గ్రూప్‌నకు.. ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణం ఇవ్వడంపై గతేడాది దుమారం చెలరేగింది. ఈ అంశంపై ఆరోపణలు ఎదుర్కొన్న కొచ్చర్​ను.. బ్యాంక్‌ బోర్డు తాత్కాలికంగా బాధ్యతల నుంచి తప్పించింది. కానీ, ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేపట్టడం మొదలు పెట్టింది. జూన్‌ 6న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ బీఎన్‌ శ్రీకృష్ణను ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి నియమించింది.

ఈ పరిణామాల తర్వాత ఆమెను తొలగిస్తున్నట్లు బ్యాంక్‌ అధికారికంగా ప్రకటించింది. ఆమెకు చెల్లించాల్సిన బోనస్‌లు, ఇతర మొత్తాలను నిలిపివేసింది. ఏప్రిల్‌ 2009 నుంచి 2018 మార్చి వరకు చెల్లించిన బోనస్‌లనూ వాపస్‌ చేయాలని కోరింది.

ఇదీ చూడండి:'లక్ష'ణంగా నిద్రపోయే ఉద్యోగం.. ఏంటో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details