హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ క్యాతే పసిఫిక్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల కారణంగా.. సంస్థలో భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. మొత్తం 8,500 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించనున్నట్లు బుధవారం ప్రకటించింది. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఈ కోత దాదాపు 24 శాతానికి సమానం.
ప్రాంతీయ అనుబంధ సంస్థ.. క్యాతే డ్రాగన్ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు క్యాతే పసిఫిక్ వెల్లడించింది.
"మహమ్మారి ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. కఠిన నిజమేమిటంటే.. సంస్థ మనుగడ సాగించాలంటే మూలాల నుంచి పునర్నిర్మాణం అవసరం. వీలైనంత ఎక్కువగా ఉద్యోగాలను కాపాడేందుకు, వినియోగదారులకు సంబంధించి మా బాధ్యతను నిర్వర్తించేందుకు ఇది అవసరం. "
-అగస్టస్ టంగ్, క్యాతే పసిఫిక్ సీఈఓ