తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండు రోజుల్లో కార్ల ధరలకు రెక్కలు!

దేశంలోని ప్రముఖ ఆటో మొబైల్​ కంపెనీలు తాము ఉత్పత్తి చేసే కార్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. సవరించిన ధరలు ఏప్రిల్​ 1నుంచి అమలులోకి వస్తాయని తెలిపాయి. ఈ రేట్లు మోడల్​ను, వేరియంట్​ను బట్టి మారతాయని స్పష్టం చేశాయి.

car price hike from next fiscal year
రెండు రోజుల్లో కార్ల ధరలకు రెక్కలు!

By

Published : Mar 30, 2021, 4:47 PM IST

రెండు రోజుల్లో కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. సుమారు ఆరు శాతం మేర పెంచేందుకు దేశంలోని ప్రముఖ ఆటో మొబైల్​ కంపెనీలు సిద్ధం అయ్యాయి. అయితే ఈ రెండు రోజుల్లో కారు బుక్​ చేసుకుంటే ఆ మొత్తం నుంచి మినహాయింపు పొందొచ్చని అంటున్నారు మార్కెట్​ విశ్లేషకులు.

కారణం ఇదే..

ఏప్రిల్​ ఒకటో తేదీ నుంచి కార్ల ధరలు పెరగనున్నట్లు కార్ల ఉత్పత్తి కంపెనీలు తెలిపాయి. ఈ ఏడాదిలో ధరలు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కానీ తప్పడం లేదంటున్నాయి సంబంధిత సంస్థలు. కార్ల ఉత్పత్తిలో కీలకమైన ప్లాస్టిక్​, స్టీల్​, అల్యూమినియం వంటి ముడి పదార్థాల రేట్లు పెరగడమే ఇందుకు కారణం అని చెప్తున్నాయి.

ఏఏ సంస్థలు ఏ మేరకు రేట్లు పెంచుతున్నాయో చూద్దాం.

మారుతీ సుజుకీ

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ మిగతా అన్నీ సంస్థల కంటే ముందుగా రేట్లను పెంచుతామని ప్రకటించింది. సవరించబోయే ధరలు ఒక శాతం నుంచి ఆరు శాతం వరకు ఉండొచ్చని తెలిపింది. పెంచిన రేట్లు మోడల్​ను, వేరింయంట్​ను బట్టి మారుతాయని స్పష్టం చేసింది.

నిస్సాన్​

జపాన్​కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్​ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశీయంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ఎంత శాతం మేరకు పెంచుతారనే దానిపై స్పష్టతను ఇవ్వలేదు. ధరలు మోడల్​, వేరియంట్ల ఆధారంగా పెరుగుతాయని తెలిపింది. ముడి సరకుల ధరలు పెరగడమే ఇందుకు కారణమని వివరించింది.

రెనో​ ఇండియా

తాము ఉత్పత్తి చేసే కార్లపై కొంత శాతం మేర రేట్లు పెంచుతున్నామని రెనో ఇండియా ప్రకటించింది. పెంచిన ధరలు ఇటీవల విడుదల చేసిన కైగర్​ కాంప్యాక్ట్​ ఎస్​యూవీ నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. సవరించిన ధరలు 10 వేల నుంచి 15 వేల వరకు ఉండొచ్చని చెప్పింది.

డాట్​సన్​

వచ్చే నెల నుంచి తమ కార్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రముఖ తయారీ కంపెనీ అయిన డాట్​సన్​ తెలిపింది. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న డాట్​సన్​ గో, గో ప్లస్​, రెడీ గోకు వర్తిస్తాయని పేర్కొంది. కార్ల రకాలను బట్టి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.

టయోటా కిర్​లోస్కర్​ మోటార్​

టయోటా కంపెనీ తాను ఉత్పత్తి చేసే అన్ని మోడళ్ల ధరలను సమీక్షిస్తామని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రేట్లను పెంచుతున్నట్లు పేర్కొంది. కార్ల ఉత్పత్తికి కావాల్సిన ముడి పదార్థాల రేట్లు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:కార్​ కొనాలా? ఈ బంపర్ ఆఫర్స్​ గురించి తెలుసుకోండి...

ABOUT THE AUTHOR

...view details