తెలంగాణ

telangana

ETV Bharat / business

టెలికాం సంస్థలకు కేంద్రం భారీ ఊరట!

టెల్కోల స్పెక్ట్రమ్ బకాయిల చెల్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్​టెల్, వొడాఫోన్-​ఐడియా, జియోలు చెల్లించాల్సిన రూ.42 వేల కోట్లకు రెండేళ్లు గడువిచ్చింది.

టెలికాం సంస్థలకు కేంద్రం భారీ ఊరట!

By

Published : Nov 20, 2019, 10:35 PM IST

టెలికాం కంపెనీలకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. భారీగా పెరుకుపోయిన స్పెక్ట్రమ్ బకాయిలు చెల్లించేందుకు రెండేళ్ల గడువునిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన.. కేబినేట్​ సమావేశంలో ఈ మోరటోరియానికి అనుమతి లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో.. 2020-21, 2021-22 రెండేళ్ల వరకు.. దిగ్గజ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా, జియోలకు రూ.42,000 కోట్ల తక్షణ చెల్లింపుల నుంచి ఉపశమనం లభించనుంది.

ఇదీ చూడండి:ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. కిలో @ రూ.400

ABOUT THE AUTHOR

...view details