తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశంలో వ్యాపార విశ్వాసం సన్నగిల్లుతోంది! - బిజినెస్ వార్తలు తెలుగు

ఈ ఏడాది ఆగస్టు-అక్టోబర్​ త్రైమాసికంలో బిజినెస్ కాన్ఫిడెన్స్​ సూచీ 15.3 శాతం తగ్గినట్లు ఓ సర్వే వెల్లడించింది. గత కొన్ని త్రైమాసికాల్లో దేశ ఆర్థిక స్థితులు, వ్యాపార వాతావరణం ప్రతికూలంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది సర్వే.

దేశంలో వ్యాపార విశ్వాసం సన్నగిల్లుతోంది!

By

Published : Nov 12, 2019, 11:06 PM IST

దేశంలో గత కొన్ని త్రైమాసికాల్లో ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వాతావరణం ప్రతికూలంగా మారినట్లు ఓ నివేదిక వెల్లడించింది. నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ అప్లైడ్ ఎకనామిక్​ రీసర్చ్​ (ఎన్​సీఏఈఆర్​) చేసిన ఈ సర్వేలో దేశ వ్యాపార విశ్వాసంపై పలు కీలక విషయాలు వెల్లడించింది. 600 భారతీయ కంపెనీలపై జరిపిన సర్వే ఆధారంగా నివేదికను రూపొందించింది.

ఈ ఏడాది మే-జులై మూడు నెలలతో పోలిస్తే.. ఆగస్టు-అక్టోబర్ త్రైమాసికంలో బిజినెస్​ కాన్ఫిడెన్స్ సూచీ 15.3 శాతం తగ్గినట్లు పేర్కొంది. 2019-20 రెండో త్రైమాసికంలో ఈ సూచీ 103.1 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.

గత ఏడాది ఆగస్టు-అక్టోబర్​ త్రైమాసికంతో పోలిస్తే.. ఈ ఏడాది అదే సమయంలో బిజినెస్​ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 22.5 శాతం క్షీణించినట్లు నివేదిక పేర్కొంది.

నివేదికలో పేర్కొన్న కీలక విషయాలు..

  • రానున్న ఆరు నెలల్లో దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడొచ్చు
  • కంపెనీల ఆర్థిక స్థితి ఆరు నెలల్లో పుంజుకుంటుంది
  • పెట్టుబడులు ప్రస్తుతం సానుకూలంగా ఉన్నాయి

ఇదీ చూడండి: ఇన్ఫోసిస్​పై మరో లేఖాస్త్రం.. సీఈఓనే లక్ష్యం..!

ABOUT THE AUTHOR

...view details