తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2020, 12:03 PM IST

ETV Bharat / business

తొలి​ ట్రేడ్​లో 'బర్గర్​ కింగ్' రికార్డులు

దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్​ అయిన తొలి రోజే ఫాస్ట్​ ఫుడ్ ప్యాపార సంస్థ బర్గర్​ కింగ్ షేరు రికార్డు స్థాయిలో పెరిగింది. షేర్ ఇష్యూ ధర (రూ.60)తో పోలిస్తే 120 శాతానికిపైగా పెరిగింది. ఒక షేరు ధర ప్రస్తుత రూ.134 వద్ద కొనసాగుతోంది.

Burger King remarkable market debu
బర్గర్​ కింగ్ షేరు రికార్డు లాభాలు

ప్రముఖ ఫాస్ట్​ ఫుడ్​ వ్యాపార సంస్థ 'బర్గర్​ కింగ్ ఇండియా' లిస్డింగ్​ ట్రేడ్​లో అదరగొట్టింది. ఇష్యూ ధర (రూ.60)తో పోలిస్తే తొలి ట్రేడ్​లో షేరు దాదాపు 120 శాతం పెరిగింది.

బీఎస్​ఈలో 92.25 శాతం ప్రీమియంతో రూ.115.35 వద్ద సెషన్ ప్రారంభించింది బర్గర్ కింగ్. ప్రస్తుతం 120 శాతానికిపైగా వృద్ధితో రూ.133 వద్ద ట్రేడవుతోంది.

ఎన్​ఎస్​ఈలో 87.5 శాతం వృద్ధితో 112.50 వద్ద సెషన్​ను ప్రారభించిన ఈ సంస్థ షేరు ప్రస్తుతం రూ.134 వద్ద కొనసాగుతోంది.

బీఎస్​ఈ ప్రకారం.. బర్గర్ కింగ్ మార్కెట్ క్యాపిటల్​ రూ.4,927 కోట్లుగా ఉంది.

రూ.810 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చిన బర్గర్​ కింగ్.. 156.65 రెట్లు అధికంగా సబ్​స్క్రైబ్​ అయ్యింది.

ఇదీ చూడండి:ఎయిర్​ఇండియా కొనుగోలుకు నేడు టాటా గ్రూప్ బిడ్!

ABOUT THE AUTHOR

...view details