తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్​ దెబ్బ : భారీగా కుప్పకూలిన స్టాక్​మార్కెట్లు - స్టాక్ మార్కెట్​ అప్​డేట్​

stocks
స్టాక్ మార్కెట్లు

By

Published : Feb 1, 2020, 9:43 AM IST

Updated : Feb 28, 2020, 6:08 PM IST

15:40 February 01

పద్దుతో బేరుమన్న సూచీలు

స్టాక్ మార్కెట్లు నేడు రికార్డుస్థాయి నష్టాలను మూటగట్టుకున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 988 పాయింట్లు క్షీణించి 39,735 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 318 పాయింట్లు కోల్పోయి..11,643 వద్ద ముగిసింది. 

పద్దు నిరాశలు..

ఆదాయపు పన్ను పరిమితి పెంపు, శ్లాబులను సవరించినప్పటికీ.. దీన్ని ఐచ్ఛికంగా నిర్ణయించింది కేంద్రం. అయితే ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో భారీ ఊరటనిచ్చే దిశగా బడ్జెట్​లో చర్యలు ఉంటాయని భావించిన మదుపరులకు ఈ అంశం తీవ్ర నిరాశ కలిగించింది. ఫలితంగా అమ్మకాలు వెల్లువెత్తి.. మార్కెట్లు రికార్డుస్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,906 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 39,631 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,017 పాయింట్ల అత్యధిక స్థాయి, 11,639 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివివే..

టీసీఎస్​ 4.24 శాతం, హెచ్​యూఎల్​ 1.73 శాతం, నెస్లే ఇండియా 1.68 శాతం, టెక్​ మహీంద్రా 1.21 శాతం, ఇన్ఫోసిస్ 0.08 శాతం లాభాలను నమోదు చేసింది. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి.

ఐటీసీ 6.74 శాతం, హెచ్​డీఎఫ్​సీ 6.18 శాతం, ఎల్​&టీ 6.15 శాతం, ఎస్​బీఐ 4.94 శాతం, ఓఎన్​జీసీ 4.68 శాతం నష్టపోయాయి.
 

15:21 February 01

కేంద్ర బడ్జెట్​ నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 1049 పాయింట్లకుపైగా పతనమై 39,703 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 306 పాయింట్లు తగ్గి 11 వేల 655 వద్ద కదలాడుతోంది. 

15:07 February 01

బడ్జెట్​ నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 900 పాయింట్లకుపైగా పతనమైంది. ప్రస్తుతం 840 పాయింట్ల నష్టంతో 39 వేల 885 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 265 పాయింట్లు తగ్గి 11 వేల 698 వద్ద ట్రేడవుతోంది. 

13:51 February 01

రికార్డు స్థాయి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు..

పద్దుపై మదుపరుల అంచనాలు ఫలించని నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి.

సెన్సెక్స్ ఏకంగా 699 పాయింట్ల నష్టంతో 40,024 వద్దకు పడిపోయింది. నిఫ్టీ 225 పాయింట్ల క్షీణతతో 11,736 వద్ద ట్రేడవుతోంది.

13:29 February 01

నిరాశపరిచిన పద్దు..

మిడ్ సెషన్ తర్వాత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. కేంద్ర బడ్జెట్​లో ఆశించిన స్థాయిలో పన్ను మినహాయింపు ఇవ్వనందున మదుపరుల సెంటిమెంట్ దిబ్బతింది. 

సెన్సెక్స్ ఏకంగా 372 పాయింట్లకు పైగా నష్టంతో..40,350 స్థాయి వద్ద కొనసాగుతోంది. నిప్టీ 207 పాయింట్ల క్షీణతతో 11,754 వద్ద ట్రేడవుతోంది.

12:49 February 01

మిడ్​ సెషన్​...

మిడ్​ సెషన్​లో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 57 పాయింట్లకు పైగా నష్టంతో 40,665 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11 పాయింట్లకు పైగా కోల్పోయి 11,951 వద్ద కొనసాగుతోంది. 

హెచ్​యూఎల్​, మారుతీ, టీసీఎస్​, ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, ఓఎన్​జీసీ, టాటా స్టీల్, ఎల్​&టీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:06 February 01

క్రమంగా వృద్ధి...

పద్దు ఆశలతో మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి.

సెన్సెక్స్ 114 పాయింట్ల వృద్ధితో ప్రస్తుతం 40,838 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో.. తిరిగి 12,000 మార్క్ దాటింది. వాహన రంగ షేర్లు లాభాలకు ఊతమందిస్తున్నాయి. 

మారుతీ, ఆల్ట్రాటెక్​, బజాజ్​ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

ఎన్​టీపీసీ, టెక్​ మహీంద్రా, పవర్​గ్రిడ్, హెచ్​సీఎల్​టెక్​, ఓఎన్​జీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:27 February 01

లాభాల్లోకి సూచీలు..

స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి కాస్త తేరుకుంటున్నాయి. వృద్ధికి ఊతమందించే దిశగా పద్దులో ప్రతిపాదనలు ఉండొచ్చనే అంచనాలతో మదుపరుల సెంటిమెంట్ బలపడింది. 

సెన్సెక్స్ 49 పాయింట్లకు పైగా లాభంతో.. ప్రస్తుతం 40,772 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 9 పాయింట్లకు పైగా వృద్ధితో 11,971 వద్ద కొనసాగుతోంది.

07:56 February 01

స్టాక్​ మార్కెట్​ లైవ్​: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బడ్జెట్​ స్పెషల్ సెషన్​లో​ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్షీణించనుందన్న ఆర్థిక సర్వే అంచనాల నేపథ్యంలో మదుపరులు అమ్మకాలపై దృష్టి సారిస్తున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 55 పాయింట్లకు పైగా నష్టంతో.. ప్రస్తుతం 40,670 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 22 పాయింట్ల క్షీణతతో 11,940 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

హెచ్​యూఎల్, ఐటీసీ, మారుతీ, ఏషియన్ పెయింట్స్, ఎస్​బీఐ లాభాల్లో ఉన్నాయి. 

పవర్​గ్రిడ్​, టెక్ మహీంద్రా, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్ టెక్​, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి.

Last Updated : Feb 28, 2020, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details