ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌తో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రణాళికలు వేస్తోంది. తమ యూజర్లు కాల్స్ మాట్లాడితే సంస్థ నుంచి 6 పైసలు ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఐయూసీ ఛార్జీల పేరుతో.. ఇతర నెట్‌వర్క్‌లతో మాట్లాడేందుకు రిలయన్స్ జియో ఇటీవల నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జీ వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌ను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఆఫర్ వివరాలు ఇలా..
తమ యూజర్లు ఐదు నిమిషాలకు పైగా కాల్ మాట్లాడితే వారికి ఆరు పైసల చొప్పున.. బీఎస్ఎన్ఎల్ క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు సమాచారం.
వైర్‌లైన్, బ్రాడ్ బాండ్, ఎఫ్టీటీహెచ్ వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందొచ్చు.
బీఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన ఈ కొత్త ఆఫర్ మంచి ఫలితాలు ఇస్తుందని టెలికాం నిపుణులు అంటున్నారు. వీటికి తోడు బీఎస్ఎన్ఎల్ సహా ఎంటీఎన్ఎల్లను పరిరక్షించేందుకు ఇటీవల భారీ ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. ఈ ప్రణాళికలన్నీ బీఎస్ఎన్ఎల్కు వినియోగదారులను పెంచే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నా: ఎలాన్ మస్క్