తెలంగాణ

telangana

ETV Bharat / business

'కార్వీ'కి మరో షాక్​- బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ లైసెన్సు నిలిపివేత

కార్వీ స్టాక్ బ్రోకింగ్స్​ లిమిటెడ్ ట్రేడింగ్ లైసెన్స్​ను బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ నిలిపివేశాయి. నిబంధనల ఉల్లంఘనే ఇందుకు కారణమని తెలిపాయి.

BSE, NSE suspend Karvy Stock Broking trading licence
'కార్వీ'కి మరో షాక్​- బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ లైసెన్సు నిలిపివేత

By

Published : Dec 2, 2019, 1:58 PM IST

కార్వీ స్టాక్​ బ్రోకింగ్స్​ లిమిటెడ్​కు మరిన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. అన్ని విభాగాల్లో ట్రేడింగ్​ లైసెన్స్​ను సస్పెండ్ చేశాయి బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి, జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి. స్టాక్​మార్కెట్ల నిబంధనలు ఉల్లంఘించడమే ఇందుకు కారణమని ప్రకటించాయి.

క్లయింట్ల షేర్లను కార్వీ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై సెబీ ఇటీవలే కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ట్రేడింగ్​ లైసెన్స్​ను నిలిపివేశాయి బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ.

ఇలా మొదలు...

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజి ఇటీవల తనిఖీలు నిర్వహించింది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌(కేఎస్‌బీఎల్‌) రూ.1096 కోట్లను తన గ్రూప్‌ కంపెనీ కార్వీ రియాల్టీకి ఏప్రిల్‌ 2016 నుంచి అక్టోబరు 2019 మధ్య బదిలీ చేసిందని గుర్తించింది. క్లయింట్లకు చెందిన ఖాతాల్లో పలు అవకతవకలు జరిగినట్లు నిర్ధరించింది.

వెంటనే కార్వీపై కొరడా ఝుళిపించింది సెబీ. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని, ప్రస్తుత క్లయింట్ల ఆర్డర్లను ఎగ్జిక్యూట్‌ చేయరాదని ఆంక్షలు విధించింది.

ABOUT THE AUTHOR

...view details