తెలంగాణ

telangana

ETV Bharat / business

బీపీసీఎల్​ ఉద్యోగులకు వీఆర్​ఎస్​​.. కారణమిదేనా!

భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్).. తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్​ఎస్​) ఆఫర్​ను ప్రకటించింది. ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నవేళ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. వీఆర్​ఎస్​ వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

bpcl vrs
బీపీసీఎల్ వీఆర్​ఎస్

By

Published : Jul 26, 2020, 4:56 PM IST

Updated : Jul 27, 2020, 6:59 AM IST

ప్రభుత్వరంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్).. తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) అందుబాటులోకి తెచ్చింది. బీపీఎసీఎల్​లో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటాను విక్రయించి.. సంస్థను ప్రైవేటీకరించనున్న నేపథ్యంలో ఉద్యోగులకు ఈ ఆఫర్ ప్రకటించింది. బీపీసీఎల్​లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు ప్రైవేటు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసేందుకు.. జులై 31 తుది గడువుగా ఉంది.

వ్యక్తిగత కారణాలతోగాని, సంస్థ ప్రైవేటీకరణ తర్వాత తాము ఆ స్థానంలో కొనసాగలేమేమో అనుకునే వారంతా వీఆర్​ఎస్​ను ఎంపిక చేసుకోవచ్చని బీబీసీఎల్ వెల్లడించింది. జులై 23 నుంచే వీఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.. ఆగస్టు 13 తుది గడువుగా ఉంది.

45 ఏళ్లు నిండిన ఉద్యోగులంతా వీఆర్​ఎస్​కు అర్హులేనని వెల్లడించింది బీపీసీఎల్. స్పోర్ట్స్​ కోటా ద్వారా ఎంపికైనా ఉద్యోగులు, బోర్టు స్థాయి ఉద్యోగులకు మాత్రం వీఆర్​ఎస్ వర్తించదని సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. 5 నుంచి 10 శాతం ఉద్యోగులు వీఆర్​ఎస్​ తీసుకుంటారని బీపీసీఎఎల్​ అంచనా వేస్తోంది.

వీఆర్​ఎస్ పరిహారం..

  • వీఆర్​ఎస్​ను ఎంపిక చేసుకున్న వారికి సర్వీసు పూర్తయిన ప్రతి సంవత్సరానికి రెండు నెలల చొప్పున లేదా సర్వీసు మిగిలి ఉన్న కాలానికి ఏడాదికి నెల చొప్పున.. రెండింటిలో ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని పరిహారంగా చెల్లించనుంది బీపీసీఎల్.
  • రిటైర్మెంట్ తర్వాత కూడా కొందరికి మెడికల్​ బెనిఫిట్స్ లభించనున్నాయి. వీఆర్​ఎస్ తీసుకుని స్వదేశానికి రావలనుకునే వారికి ఆ ఖర్చులను కూడా కంపెనీనే భరిస్తుంది.
  • వీటితో పాటు సెలవులను ఎన్​క్యాష్​మెంట్ చేసుకునేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పించింది బీపీసీఎల్​.

ఇదీ చూడండి:వస్త్ర పరిశ్రమ పతనాన్ని అడ్డుకున్న ఫేస్​మాస్క్!

Last Updated : Jul 27, 2020, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details