తెలంగాణ

telangana

ETV Bharat / business

బోయింగ్​ 737 మ్యాక్స్​లో మరో కొత్త సమస్య! - బోయింగ్ విమానాల్ల లోపాలు

బోయింగ్​ను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే 737 మ్యాక్స్​లో ఉన్న పలు సమస్యల కారణంగా వాటి సేవలు నిలిపివేసిన సంస్థ.. తాజాగా మరో లోపాన్ని గుర్తించింది. ప్రస్తుతం పాత సమస్యల పరిష్కారానికి కసరత్తు చేస్తోన్న బోయింగ్.. తాజా సమస్యను వీలైనంత త్వరగా సరిచేయనున్నట్లు పేర్కొంది.

BOING
బోయింగ్​

By

Published : Jan 18, 2020, 9:40 PM IST

ఇప్పటికే పలు సమస్యలతో గ్రౌండ్‌కు పరిమితమైన 737 మ్యాక్స్‌లో మరో కొత్త లోపాన్ని గుర్తించినట్లు బోయింగ్ ప్రకటించింది. అయితే దీన్ని అతిచిన్న లోపంగా పేర్కొన్న బోయింగ్‌ వీలైనంత త్వరగా సరిచేయడానికి కృషి చేస్తామని వెల్లడించింది.

తాజా సమస్య వల్ల.. విమానాలను తిరిగి సేవల్లో చేర్చాలని నిర్దేశించుకున్న తేదీపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన తాజా లోపం, దాన్ని సవరించడానికి తీసుకుంటున్న చర్యలపై ఫెడరల్‌ ఏవియేషన్‌కు వివరాలు అందజేశామని పేర్కొంది.

ప్రయాణికులకు సురక్షితమైన సేవలందించడమే సంస్థ తొలి ప్రాధాన్యమని చెప్పుకొచ్చింది బోయింగ్​. గతవారం నిర్వహించిన టెక్నికల్‌ రివ్యూలో తాజా సమస్యను చేర్చలేదని వెల్లడించింది. విమానాన్ని అదుపు చేసే సాఫ్ట్‌వేర్‌, సిమ్యులేటర్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిచేసేందుకు ఇప్పటికే బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను సేవల నుంచి ఉపసంహరించుకున్న విషయం విదితమే.

గతంలో ఈ రకానికి చెందిన రెండు విమానాలు భారీ ప్రమాదానికి గురైన నేపథ్యంలో బోయింగ్‌ వీటిని నిలిపివేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి లోపాలను సవరించేందుకు కసరత్తులు చేస్తోంది.

ఇదీ చూడండి:737- మ్యాక్స్ జెట్​ల ఉత్పత్తి నిలిపివేసిన బోయింగ్​

ABOUT THE AUTHOR

...view details