అంతరిక్ష రంగంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది విమాన తయారీ సంస్థ బోయింగ్. వ్యోమగాములను నింగిలోకి తీసుకెళ్లే స్టార్‌లైనర్ కాప్య్సూల్‌ను న్యూమెక్సికో ఎడారిలో వ్యోమగాములు లేకుండా డమ్మీ కాప్య్సూల్‌ను పరీక్షించింది. ప్రయోగించిన వెంటనే నింగిలోకి దూసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ కాసేపటి తర్వాత నేలమీదకు సురక్షితంగా దిగింది.
అయితే .. కిందకు దిగే క్రమంలో మూడు పారాచ్యూట్‌లు తెరుచుకోవాల్సి ఉండగా రెండే తెరుచుకున్నాయి. అయినప్పటికీ వ్యోమగాములను కాప్య్సూల్ సురక్షితంగా దించగలదని బోయింగ్ సంస్థ సహా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా తెలిపింది. ఏదైనా అత్యవసర సమయంలో కిందకు దిగేందుకు స్టార్‌లైనర్ కాప్య్సూస్ ఉపకరిస్తోందని వెల్లడించింది.