తెలంగాణ

telangana

By

Published : Mar 24, 2019, 7:31 AM IST

ETV Bharat / business

346 మంది దుర్మరణం నేర్పిన పాఠం..!

వరుసగా ప్రమాదాల బారిన పడుతున్న బోయింగ్ 737 మ్యాక్స్ 8లో లోపాలను సరిచేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాఫ్ట్​వేర్​ అప్​డేట్​కు సంబంధించి ఫెడరల్​ ఏవియేషన్ ఏజెన్సీ నుంచి అనుమతులు లభించాల్సి ఉంది.

బోయింగ్

ఇండోనేసియా, ఇథియోపియా విమాన ప్రమాదాలకు కారణమని భావిస్తున్న ఎంసీఏఎస్​ యాంటీ స్టాల్​ వ్యవస్థలో లోపాలను.. బోయింగ్​ సరిదిద్దినట్లు పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ఐదు నెలల్లో రెండు బోయింగ్​ 737 మ్యాక్స్​ 8 విమానాలు ప్రమాదం బారిన పడిన కారణంగా.. వీటిలో లోపాలపై దృష్టి పెట్టిందీ తయారీ సంస్థ.

గతేడాది అక్టోబరులో జరిగిన దుర్ఘటనలో 189 మంది మృత్యువాత పడ్డారు. మార్చి 10న జరిగిన ఇథియోపియన్​ ఎయిర్​లైన్స్​ ప్రమాదంలో 157 మంది మరణించారు.


ఈ దుర్ఘటనలతో బోయింగ్​పై ఒత్తిడి పెరిగింది. తక్షణమే చర్యలు తీసుకోపోతే సంస్థ మనుగడకే నష్టమని తెలుసుకున్న బోయింగ్​ వెంటనే లోపాలు సరిదిద్దే పనిలో పడింది.

తాజాగా బోయింగ్​ 737 మ్యాక్స్​ 8 విమానాల సాఫ్ట్​ వేర్​ అప్​డేట్​ చేసింది. ఈ సాఫ్ట్​వేర్​ను అన్ని బోయింగ్ 787 మ్యాక్స్ విమానాల్లో నవీకరించేందుకు.. ఫెడరల్​ ఏవియేషన్ ఏజెన్సీ నుంచి అనుమతులు లభించాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details