తెలంగాణ

telangana

ETV Bharat / business

బోయింగ్ ​ నూతన సీఈవోగా డేవిడ్​ కాల్హూన్​

బోయింగ్​ 737 మాక్స్ విమానాలను అంతర్జాతీయంగా పలు దేశాలు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ప్రస్తుత సీఈవోగా ఉన్న డెన్నిస్ ముయిలెన్‌బర్గ్​ను తొలగించింది బోయింగ్​ సంస్థ. నూతన సీఈవోగా డేవిడ్ కాల్హూన్​ను నియమించింది.

By

Published : Dec 24, 2019, 12:07 AM IST

Boeing ousts Muilenburg, names Chair David Calhoun as CEO
బోయింగ్ ​ నూతన సీఈవోగా డేవిడ్​ కాల్హౌన్​

బోయింగ్​ 737 మాక్స్​ విమానాలను అంతర్జాతీయంగా పలు దేశాలు నిషేధించిన నేపథ్యంలో ప్రస్తుత సీఈవోను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. నూతన సీఈవోగా డేవిడ్​ కాల్హూన్​​ను నియమించింది.

వినియోగదారులు, ఇతర వాటా దారులకు, రెగ్యులేటర్లకు సంస్థపై విశ్వాసాన్ని పెంచటమే కాకుండా, వారి మధ్య సంబంధాలను మెరుగుపరచటానికి సీఈవో​గా డేవిడ్​ను నియమించినట్లు సంస్థ తెలిపింది.

2020 జనవరి 13 నుంచి డేవిడ్​ పదవీ బాధ్యతలను స్వీకరిస్తారని ఓ ప్రకటన విడుదల చేసింది బోయింగ్​. అప్పటి వరకు కంపెనీ ప్రధాన ఆర్థిక అధికారిగా ఉన్న గ్రెగ్​ స్మిత్​ తాత్కాలిక సీఈవోగా కొనసాగుతారని పేర్కొంది.

సీఈవో మార్పు ప్రకటన తర్వాత బోయింగ్ షేర్ల విలువ 3.4 శాతం పెరిగాయి.

ఇంతకీ ఏం జరిగింది?

ఇథియోపియా ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం అడిస్​ అబాబా వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 157 మంది మరణించారు. గతంలో ఇండోనేషియాలోనూ ఇదే శ్రేణి విమానం కూలి 180 మంది మృతి చెందారు.

ఈ నేపథ్యంలో బోయింగ్​ 737 మాక్స్ 8 విమానాలను భారత్​తో పాటు యూఏఈ, ఒమన్​, న్యూజిలాండ్​, ఫ్రాన్స్​ దేశాలు నిషేధించాయి. ఈ విమానాల ఉత్పత్తిని వచ్చే నెల నుంచి నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది బోయింగ్​.

ఇదీ చూడండి:'రాజ్యాంగంపై దాడి చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details