తెలంగాణ

telangana

ETV Bharat / business

బీఎండబ్ల్యూ కొత్త బైక్‌ @ రూ.18.9 లక్షలు - BMW Motorrad R18 cruiser

బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్​ విడుదలైంది. బీఎండబ్ల్యూ R18 పేరిట తీసుకొచ్చిన ఈ క్రూయిజర్​ బైక్​ ధర.. 18.9 లక్షలు. ఇవాళ్టి నుంచి బుకింగ్స్​ ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది.

BMW R18 Cruiser Motorcycle India Launch Price Rs 18.9 Lakh
బీఎండబ్ల్యూ కొత్త బైక్‌ @ ₹18.9 లక్షలు

By

Published : Sep 19, 2020, 9:51 PM IST

జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటార్డ్‌ దేశంతో మరో కొత్త బైక్‌ను విడుదల చేసింది. బీఎండబ్ల్యూ R18 పేరిట కొత్త క్రూయిజర్‌ బైక్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్‌తో ఆ సంస్థ క్రూయిజర్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టినట్లయింది. మొత్తం రెండు వేరియంట్లలో ఈ బైక్‌ లభ్యం కానుంది. స్టాండర్డ్‌ మోడల్‌ ధర రూ.18.9 లక్షలు కాగా.. ఫస్ట్‌ ఎడిషన్‌ పేరిట తీసుకొస్తున్న బైక్‌ ధర రూ.21.9 లక్షలుగా (ఎక్స్‌షోరూం) కంపెనీ నిర్ణయించింది. ఇవాళ్టి నుంచే బుకింగ్స్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

బీఎండబ్ల్యూ R‌18 ద్వారా క్రూయిజర్‌ విభాగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని, ఈ రోజు కోసమే ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారని ఆ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పాహ్‌ తెలిపారు. ఈ బైక్‌ 1802 సీసీ ఇంజిన్‌, ఆరు గేర్లతో వస్తోంది. ఇంజిన్‌ 4,750 ఆర్‌పీఎం వద్ద 89.75 బీహెచ్‌పీని విడుదల చేస్తుంది. 3000 ఆర్‌పీఎం వద్ద 158 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో రివర్స్‌ గేర్‌ సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న డుకాటీ డియావెల్‌ 1260, ఇటీవలే వచ్చిన ట్రయాంఫ్‌ రాకెట్‌ 3జీటీ బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ABOUT THE AUTHOR

...view details