తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐదేళ్లలో టెలికాం రంగంలో భారీగా ఉద్యోగాల కోత! - 5జీ సాంకేతికత

టెలికాం రంగలో రానున్న ఐదేళ్లలో భారీగా ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని టెలికాం రంగ ఉన్నతాధికారి అన్నారు. పెరుగుతున్న సాంకేతికతే ఇందుకు కారణమని ఆ ఆధికారి తెలిపారు.

ఉద్యోగాల కోత!

By

Published : Jun 29, 2019, 6:03 AM IST

సాంకేతికతలో ప్రపంచం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పనులకు టెక్నాలజీని వినియోగించడం వల్ల ఎన్నో ఉద్యోగాలకు ఎసరు వస్తుందని ఇప్పటికే చాలా సర్వేలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఆటోమేషన్​కు పెరుగుతున్న ఆదరణ కారణంగా టెలికాం రంగంలో వచ్చే 3-5 ఏళ్లలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశముందని ఆ రంగానికి చెందిన నిపుణుడు ఎస్​.పీ. కొచ్చర్​ అభిప్రాయపడ్డారు.

"వచ్చే 3-5 ఏళ్లలో టెలికాం రంగంలో చదువులేని ఉద్యోగులు ఉండటం కష్టం. బ్లూకాలర్ ఉద్యోగులు లేకుండా టవర్ల నిర్వహణ వంటి పనులు సాగటం కష్టమే. కానీ.. 5జీ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఆయా ఉద్యోగాలకు డిమాండ్​ గణనీయంగా తగ్గుతుంది." --- ఎస్​.పీ. కొచ్చర్,​ టెలికాం నైపుణ్య మండలి సీఈఓ.

ప్రపంచంలో నెలకొన్న సుంకాల యుద్ధం ప్రభావం టెలికాం రంగంపైనా పడుతుందని కొచ్చర్​ అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతకత వల్ల పరిజ్ఞానం ఉన్న వారికే అధికంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

ఇదీ చూడండి: సామ్​సంగ్​ నుంచి ఆర్​-సిరీస్​ 5జీ స్మార్ట్​ఫోన్లు..!

ABOUT THE AUTHOR

...view details