తెలంగాణ

telangana

ETV Bharat / business

టీకా ట్రయల్స్ రేసులో బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ - భారత్​లో జాన్సన్​ అండ్ జాన్సన్ కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్

దేశీయంగా కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్​కోసం మరో దేశీయ సంస్థ కసరత్తు ముమ్మరం చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్, అమెరికా బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ రూపొందించిన కొవిడ్-19 టీకాను మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్​ నిర్వహించేందుకు హైదరాబాద్​కు చెందిన బయోలాజిలక్‌ ఇ.లిమిటెడ్‌కు డీసీజీఐ అనుమతులు లభించినట్లు సమాచారం.

Biological E gets CDSCO panel's nod to vaccine Trails
మరో కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్​ రేసులో బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్

By

Published : Oct 30, 2020, 7:03 AM IST

బహుళజాతి ఫార్మా కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, అమెరికాకు చెందిన బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఆవిష్కరించిన కొవిడ్‌-19 టీకాలపై మనదేశంలో క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఈ టీకాలను మనదేశంలో అందుబాటులోకి తీసుకురావడానికి హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే.

క్లినికల్‌ ట్రయల్స్​కు డీసీజీఐ అనుమతి..

ఈ సంస్థ రెండు నెలల క్రితం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో, బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో ‘లైసెన్సింగ్‌ ఒప్పందాలు’ కుదుర్చుకుంది. తదనంతరం మనదేశంలో జంతు ప్రయోగాలు చేపట్టింది. తాజాగా ఈ టీకాలను మనదేశంలో మనుషులపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించటానికి బయోలాజిలక్‌ ఇ.లిమిటెడ్‌కు డీసీజీఐ (డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతి ఇచ్చినట్లు తెలిసింది.

అడెనోవైరస్‌ ప్లాట్‌ఫామ్‌పై కొవిడ్‌-19 టీకాను జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించింది. దీనిపై అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. దీన్ని మనదేశానికి తీసుకువచ్చే దిశగా బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తును డీసీజీఐలోని సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలించింది. తదుపరి ఈ కమిటీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాపై 1- 2వ దశల మానవ ప్రయోగాల నిర్వహణకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

టీకా రేసులో..

ఇదే విధంగా బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఆవిష్కరించిన కొవిడ్‌-19 టీకాపై కూడా మనదేశంలో బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించబోతోంది. దీనిపై 1-2వ దశల ప్రయోగాల నిర్వహణకు డీసీజీఐలోని సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. డీసీజీఐ తుది అనుమతి ఇస్తే సరిపోతుంది. ఇప్పటికే మనదేశంలో మూడు, నాలుగు కంపెనీలు కొవిడ్‌-19 టీకా తీసుకువచ్చేందుకు పెద్దఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నాయి. బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ కూడా ఇప్పుడు ఈ రేస్‌లో చేరినట్లు అవుతోంది.

ఇదీ చూడండి:టీకా ట్రయల్స్​కు డాక్టర్ రెడ్డీస్ కసరత్తు ముమ్మరం

ABOUT THE AUTHOR

...view details