తెలంగాణ

telangana

ETV Bharat / business

గుడ్​ న్యూస్​: బ్రాండెడ్ కార్లపై బంపర్​ ఆఫర్స్​!

కారు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్​ ప్రకటించాయి పలు ఆటోమొబైల్​ సంస్థలు. ఈ ఏడాది ముగింపు దశకు చేరుకున్న కారణంగా పాత స్టాక్​ను భారీ డిస్కౌంట్లతో విక్రయిస్తున్నాయి. మరీ ఏ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందనే సమాచారం తెలుసుకోండి ఇప్పుడే.

Big brands offer mega discounts for Cars
బ్రాండెడ్ కార్లపై బంపర్​ ఆఫర్స్​

By

Published : Dec 13, 2019, 2:26 PM IST

కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే అందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే 2019 ముగుస్తున్న సందర్భంగా కార్ల తయారీ సంస్థలు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. దేశంలో ప్రధాన కార్ల తయారీ సంస్థలన్నీ ఆఫర్లు ప్రకటించడం గమనార్హం.

ఎందుకీ డిస్కౌంట్లు?

ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలలో వీలైనన్ని ఎక్కువ యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి కార్ల తయారీ సంస్థలు. ముఖ్యంగా ఇప్పటి వరకు మిగిలిపోయిన స్టాక్​ను వీలైనంతవరకు తగ్గించుకోవాలన్నది ఆయా సంస్థల ఆలోచన. ఇందుకోసం భారీ డిస్కౌంట్లతో కార్లను విక్రయిస్తున్నాయి.

పాత స్టాక్​ను తగ్గించుకోవడం సహా కార్లపై డిస్కౌంట్లు ఇచ్చేందుకు మరికొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 2020 ఏప్రిల్ నుంచి వాహనాలకు భారత్​​ స్టేజ్​ (బీఎస్​)-6 ఉద్గార నియమాలు తప్పనిసరి కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న బీఎస్​-4 వాహనాలను వీలైనంత ఎక్కువగా, త్వరగా విక్రయించాలని భావిస్తున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. వీటికితోడు ఈ ఏడాది భారీగా తగ్గిన వాహన విక్రయాలను డిస్కౌంట్లతోనైనా పెంచుకోవాలనేది ఆయా సంస్థల ప్యూహంగా తెలుస్తోంది.

డిస్కౌంట్లు ఇస్తున్న సంస్థలు ఇవే..

దేశీయంగా ప్రధాన కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సహా హుందాయ్​, హోండా, ఫోక్స్ వ్యాగన్, టాటా మోటార్స్​ సంస్థలు డిస్కౌంట్లు ఇస్తున్న జాబితాలో ఉన్నాయి.

మారుతీ సుజుకీ:

కారు మోడల్​ డిస్కౌంట్​
ఆల్టో 800 రూ.60,000
బలీనో రూ.45,000
ఎస్​-క్రాస్ రూ.1.13 లక్షలు
సియాజ్​ రూ.75,000
ఇగ్నిస్​ రూ.65,000

హుందాయ్​:

కారు మోడల్​ డిస్కౌంట్​
శాంత్రో రూ.55,000
వెర్నా రూ.60,000
క్రెటా రూ.95,000
ఎలాంట్రా రూ.2 లక్షలు
గ్రాండ్ ఐ10నియోస్ రూ.20,000

ఫోక్స్​ వ్యాగన్​:

కారు మోడల్​ డిస్కౌంట్​
పోలో రూ.1.5 లక్షలు

దీంతో పాటు కార్పొరేట్ ఆఫర్​ కింద రూ.25,000, డిస్కౌంట్​ బోనస్​గా రూ.10,000 వరకు అందించనున్నట్లు ఫోక్స్ వ్యాగన్ వెల్లడించింది.

హోండా:

కారు మోడల్​ డిస్కౌంట్
అమేజ్​ రూ.42,000
జాజ్​ రూ.50,000
డబ్ల్యూఆర్​-వీ రూ.45,000
సిటీ సెడాన్ రూ.62,000
సివిక్​ రూ.2 లక్షలు

టాటా:

కారు మోడల్ డిస్కౌంట్​
టియాగో రూ.75,000
హెక్సా​ రూ.1.65 లక్షలు
నెక్సాన్​ రూ.1.07 లక్షలు
ఎస్​యూవీ హారియర్​ రూ.65,000

ఇదీ చూడండి:ప్రపంచంలోనే 34వ శక్తిమంతమైన మహిళగా 'సీతమ్మ'

ABOUT THE AUTHOR

...view details