పండుగ సీజన్‌తో పాటు.. మార్కెట్లో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు ఇటీవలి కాలంలో భారీగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి దిగ్గజ సంస్థలు. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఫోన్లు.. వాటి పూర్తి వివరాలు ఇవే..
వన్‌ప్లస్ 7టీ..
ఈ వారం విడుదలైన ప్రీమియం ఫోన్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన వాటిలో వన్‌ప్లస్ 7టీ ముందు వరుసలో ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ 7కు కొనసాగింపుగా.. వన్‌ప్లస్ 7టీని తీసుకువచ్చింది ఈ సంస్థ. 8జీబీ ర్యామ్, 128 జీబీ రోమ్.. 8జీబీ ర్యామ్, 256 రోమ్.. రెండు వేరియంట్లలో ఈ మోడల్‌ను తీసుకువచ్చింది వన్‌ప్లస్. వీటి ధరలు వరుసగా రూ.37,999.. రూ.39,999గా నిర్ణయిచింది. ఈ ఫోన్ అమెజాన్‌లో నేటి నుంచి కొనుగోళ్లకు అందుబాటులోకి వచ్చింది.
వన్‌ప్లస్ 7టీ ఫీచర్లు
- 6.55 అంగుళాల ఫ్లూయిడ్ అమెలోయిడ్ డిస్ప్లే
- 48+16+12 ఎంపీలతో వెనుకపైపు మూడు కెమెరాలు
- 16 ఎంపీల సెల్ఫీ కెమెరా
- 3,800 ఎంఏహచ్ బ్యాటరీ
- స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ వీ (10క్యూ) ఆధారిత ఆక్సీజన్ ఓఎస్
మూడు కెమెరాలతో బడ్జెట్ ఫోన్
బడ్జెట్ సెగ్మెంట్లో మూడు కెమెరాలతో లెనోవో ఇటీవల కొత్త మోడల్‌ను విడుదల చేసింది. కే10 ప్లస్ పేరుతో మార్కెట్లోకి విడుదైన ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్,64 జీబీ రోమ్తో అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.10,999గా నిర్ణయించింది లెనోవో. సెప్టెంబర్ 30 నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉండనుంది ఈ ఫోన్.
కే10 ప్లస్ ఫీచర్లు..
- 6.22 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- ఆక్టాకోర్ 632 క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
- 13 ఎంపీ+5ఎంపీ+ 8ఎంపీలతో వెనుకవైపు మూడు కెమెరాలు (ఏఐ అనుసంధానం)
- 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
- 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్