కరోనా వల్ల విద్యార్థులు, ఉద్యోగులకు ల్యాప్‌టాప్ అవసరంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు, ఇతర ఆన్లైన్ కార్యకలాపాలతో వాటి కొనుగోళ్ల జోరు పెరిగింది. మహమ్మారి ప్రభావం ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు. ల్యాప్‌టాప్ ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అన్న భావనకు చాలా మంది వచ్చారు. దీంతో ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే వారు మంచిది, అందుబాటులో ధరలో కావాలి అని అనుకుంటున్నారు. 60వేల స్థాయిలో ల్యాప్‌టాప్‌ల విషయంలో చాలా మంది మక్కువ చూపిస్తున్నారు. అవసరాలకు తగ్గట్టుగా అనేక మోడళ్లను కంపెనీలు అందుబాటులో ఉంచాయి. వాటి వివరాలు మీకోసం..
అసస్ వివో బుక్ 15
రోజువారీ పెర్ఫార్మన్స్తో పాటు ప్రొడక్టివిటీకి ఇది మంచిగా సరిపోతుంది. ఈ విభాగంలో ఐ7 ప్రాసెసర్‌తో లభిస్తోన్న ఏకైన ల్యాప్‌టాప్ ఇది. ఐ7ప్రాసెసర్, ప్రత్యేకమైన గ్రాఫిక్స్, మంచి బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి ఈ ల్యాప్‌టాప్‌లో ఆకర్షణీయంగా ఉన్నాయి. కీబోర్డ్ బ్యాక్‌లైట్ ఫీచర్ ఇందులో లేదు.
- ప్రాసెసర్ - 1.8 గిగా హెడ్జ్ ఇంటెల్ కోర్ ఐ7-8550యూ
- ర్యామ్ - 8జీబీ
- స్టోరేజీ - 1టీబీ హెచ్డీడీ
- డిస్ ప్లే - 15.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ (1920 x 1080)
- గ్రాఫిక్స్ - 2జీబీ ఎన్విడియా జీఫోర్స్ 940ఎమ్ఎక్స్
- ధర - రూ.59,990
ఎసర్ నిట్రో- 5
ఇది గేమింగ్ కోసం మంచి ఎంపిక. శక్తిమంతమైన ఇంటర్నల్స్ మంచి గేమింగ్ అనుభూతిని ఇస్తాయి. ఐపీఎస్ ప్యానెల్‌తో మంచి వ్యూయింగ్ యాగింల్స్ పొందవచ్చు. దీనిని వీడియో ఎడిటింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఉన్న 55వాట్ అవర్ బ్యాటరీతో 7 గంటల వరకు ల్యాప్‌టాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
- ప్రాసెసర్ - 2.1 గిగా హెడ్జ్ ఏఎండీ రైజెన్ 5 3550హెచ్
- ర్యామ్ - 8 జీబీ
- స్టోరేజీ - 512 జీబీ ఎస్ఎస్డీ
- డిస్ ప్లే - 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ (1920 x 1080)
- గ్రాఫిక్స్ - 4జీబీ ఎన్ విడియ జీపోర్స్ జీటీఎక్స్ 1650
- ధర - రూ. 62,990
అసస్ టీయూఎఫ్ఎఫ్ఎక్స్505డీటీ
వీడియో ఎడిటింగ్ కోసం ల్యాప్‌టాప్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. ఇందులో ఉన్న ఎస్ఎస్డీని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. గేమింగ్ కోసం ఈ ల్యాప్‌టాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో కేవలం హార్డ్‌డిస్క్ మాత్రమే ఉంది.
- ప్రాసెసర్ - 2.1గిగా హెడ్జ్ ఏఎండీ రైజెన్ 5 3550హెచ్
- ర్యామ్ - 8జీబీ
- స్టోరేజీ - 1టీబీ హెచ్డీడీ
- డిస్ ప్లే - 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ(1920 x 1080)
- గ్రాఫిక్స్ - 4జీబీ ఎన్ విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1650
- ధర- రూ. 57000 దాదాపు
ఎమ్ఐ నోట్ బుక్ 14 హారిజన్ ఎడిషన్
ఆఫీసు పని కోసం ల్యాప్‌టాప్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. డిస్ప్లే సన్నగా ఉండటం వల్ల కొత్త లుక్‌తో కనిపిస్తుంది. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. బిల్డ్ ఇన్ కెమెరా ఇన్ బిల్ట్ గా లేదు. దీనిని ప్రత్యేకంగా జత చేయాల్సి ఉంటుంది.
- ప్రాసెసర్ - 1.6 గిగా హెడ్జ్ ఇంటెల్ ఐ5-10210యూ
- ర్యామ్ - 8జీబీ
- స్టోరేజీ - 512జీబీ ఎస్ఎస్డీ
- డిస్ ప్లే - 14 అంగుళాల ఫుల్ హెచ్డీ(1920 x 1080)
- గ్రాఫిక్స్ - 2జీబీ ఎన్ విడియ జీఫోర్స్ ఎమ్ఎక్స్350
- ధర - రూ. 50,999(ప్రారంభ ధర)
ఎసర్ యాస్పైర్ 3