తెలంగాణ

telangana

ETV Bharat / business

జెట్​ను ఎన్​సీఎల్​టీకి అప్పగించాలని ఎస్​బీఐ నిర్ణయం - ఎస్బీఐ

ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్​ ఎయిర్​వేస్​పై ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం కీలక నిర్ణయం తీసుకుంది. జెట్​ అంశాన్ని నేషనల్​ కంపెనీ లా ఆఫ్​ ట్రైబ్యునల్ (ఎన్​సీఎల్​టీ)కు పంపి పరిష్కారం చూపాలని స్టేట్​ బ్యాంక్​ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

జెట్​ ఎయిర్​వేస్

By

Published : Jun 18, 2019, 6:05 AM IST

Updated : Jun 18, 2019, 8:58 AM IST

ఆర్థికంగా దివాలా తీసిన జెట్​ ఎయిర్​వేస్​ను 'నేషనల్ కంపెనీ లా ఆఫ్ ట్రైబ్యునల్' (ఎన్​సీఎల్​టీ)కు పంపాలని ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నిర్ణయించింది. సెబీ మినహాయింపు ఒప్పందం కుదరాలని షరతులతో కూడిన బిడ్​ను ప్రతిపాదించారు ఓ పెట్టుబడిదారు. ఈ నేపథ్యంలో దివాలా కోడ్ 'ఐబీసీ' ప్రకారమే రుణదాతల సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్​ ప్రకటించింది.

రుణదాతలు శామన్ వీల్స్, గాగర్ ఎంటర్ ప్రైజె స్​ జూన్ 10న రుణాల విషయంపై ఎన్​సీఎల్​టీని ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై ట్రైబ్యునల్ జూన్ 20 న విచారణ చేపట్టనుంది.

నిధుల కొరతతో ఏప్రిల్ 17న సేవలు నిలిపివేసిన జెట్ ఎయిర్ వేస్ రూ.8.5 కోట్లు శామన్ వీల్స్​, రూ.53 లక్షల గాగర్​కు బకాయి పడింది. స్టేట్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు రూ.8 కోట్ల మేర బాకీ పడింది. ఉద్యోగుల వేతనాలను కలిపితే ఈ మొత్తం బాకీ భారం రూ.15 కోట్లు.

ఇదీ చూడండి: భారీగా పతనమైన జెట్ ఎయిర్​వేస్​ షేర్లు

Last Updated : Jun 18, 2019, 8:58 AM IST

ABOUT THE AUTHOR

...view details