బకాయిలు తిరిగి రాబట్టుకోవడం కోసం విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులను విక్రయించేందుకు బ్యాంకుల కన్సార్టియానికి ముంబయి ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈడీ సీజ్ చేసిన ఆస్తులను పునరుద్ధరించాలని మాల్యాకు రుణాలు ఇచ్చిన 11 బ్యాంకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన మనీలాండరింగ్ నిరోధక కోర్టు.. బ్యాంకుల అభ్యర్థనకు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. రూ.5,646.54 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను విక్రయించేందుకు అనుమతించింది.
2002 సర్ఫేసీ చట్టం ప్రకారం రికవరీ ప్రక్రియ కొనసాగనుంది. మార్గదర్శకాల ప్రకారం త్వరలోనే ఆస్తుల వేలం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.