తెలంగాణ

telangana

ETV Bharat / business

రైతులకు బ్యాంక్​ల మద్దతు- కానీ బంద్​కు దూరం - భారత్ బంద్​పై బ్యాంకర్ల ప్రకటన

రైతులు చేపట్టిన 'భారత్ బంద్​'కు దూరంగా ఉంటున్నట్లు బ్యాంక్ సంఘాలు ప్రకటించాయి. అయితే వారికి మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని వెల్లడించాయి.

Bank Unions support to Farmers protest
భారత్​ బంద్​కు దూరంగా బ్యాంక్​లు

By

Published : Dec 8, 2020, 10:37 AM IST

Updated : Dec 8, 2020, 10:43 AM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు మద్దతు తెలిపినప్పటికీ.. 'భారత్​ బంద్​'కు మాత్రం దూరంగా ఉన్నాయి బ్యాంక్ యూనియన్లు.

రైతుల చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్నామని.. బంద్​లో మాత్రం పాల్గొనడం లేదని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ), అఖిల భారత ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రకటించాయి.

రైతులకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని వెల్లడించాయి బ్యాంక్ సంఘాలు. పనిగంటల ముందు, తర్వాత నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:రైతు భవిత పరాధీనం- అందుకే అన్నదాత ఆగ్రహం!

Last Updated : Dec 8, 2020, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details