తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2019, 10:31 PM IST

ETV Bharat / business

'జెట్ ఎయిర్​వేస్​' అంశంలో బ్యాంకులపై ఒత్తిడి తేవొద్దు

జెట్​ఎయిర్​వేస్​ సంక్షోభంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసింది అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం. ఎయిర్​లైన్స్​కు మరింత రుణసాయం అందించాలంటూ బ్యాంకులపై ఒత్తిడి తేవొద్దని కోరింది. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే జెట్​ఎయిర్​వేస్​ను అధీనంలోకి తీసుకోవాలని కోరింది.

'జెట్​ఎయిర్​వేస్​ విషయంలో బ్యాంకులపై ఒత్తిడి తేవొద్దు'

జెట్​ఎయిర్​వేస్ సంక్షోభంపై స్పందించింది​ 'ఆల్​ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్​ అసోషియేషన్​'. 22 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును రక్షించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది.

ఎయిర్​లైన్స్​కు రుణం ఇవ్వాలని బ్యాంకులపై ఒత్తిడి తేవొద్దని కోరింది. బిడ్డింగ్​లో ఎవరైనా జెట్​ ఎయిర్​వేస్​ను సొంతం చేసుకోవడానికి వస్తే సరి... లేదంటే ప్రభుత్వమే అధీనం చేసుకోవాలని కోరింది.

"రుణదాతలే జెట్​ ఎయిర్​వేస్​ యజమానులు అయినప్పటికీ... ఈ సంక్షోభం నుంచి ఎయిర్​లైన్స్​ను రక్షించాలని ప్రతి ఒక్కరూ బ్యాంకులవైపు చూస్తున్నారు. జెట్​ఎయిర్​వేస్​కు నరేష్​గోయెల్​ ఇప్పటికీ ప్రమోటర్​గానే ఉన్నారు. అంతేకాదు సంస్థలో అత్యధికంగా 51 శాతం షేర్లు ఆయనకే ఉన్నాయి. ఈ పరిస్థితిలో జెట్ ఎయిర్​వేస్​ను కొనసాగిస్తారో... లేక వేరే ఎవరికైనా అమ్ముకుంటారో అది ఆయనకు సంబంధించిన విషయం​.

ఈ సంక్షోభానికి ప్రధాన కారకుడైన గోయెల్​ను రక్షించడానికే... బ్యాంకులు మరింత రుణసహకారమందించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అందరికీ సమాధానమివ్వాల్సిన గోయెల్​ను పక్కనబెట్టి మొత్తం తతంగాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు."
- ఆల్​ ఇండియా బ్యాంక్​ ఎంప్లాయిస్​ అసోసియేషన్​

అప్పులు రూ.13 వేల కోట్లకు పైనే

జెట్​ ఎయిర్​వేస్​ సంస్థ... బ్యాంకులకు రూ.8,500 కోట్లు, రుణదాతలకు రూ. 4000 కోట్లు, ఉద్యోగుల జీతాలు ఇలా అన్నీ కలుపుకుంటే మొత్తం రూ.13 వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది.

ఆఫర్లు పరిశీలిస్తున్న రుణదాతలు

ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గాలకోసం రుణదాతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్యాంకింగ్​ వర్గాల సమాచారం. అలాగే విమానాశ్రయ స్లాట్స్​తో పాటు తమ ఆస్తులను కాపాడుకునేందుకు సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నట్లు తెలిపాయి.

బిడ్డింగ్​ ప్రక్రియ పూర్తయ్యే వరకు 15 జెట్​ విమానాలను ఇతర ఎయిర్​లైన్స్​కు లీజు ఇవ్వాలనుకుంటున్నారు రుణదాతలు. ఇందుకోసం ఎయిర్​ ఇండియాతో పాటు మరిన్ని ఎయిర్​లైన్స్​ ఇచ్చిన ఆఫర్లను పరిశీలిస్తున్నారు. దీని ద్వారా ఆర్థికంగా కొంతమేర ఉపశమనం పొందాలని వారు ఆలోచిస్తున్నారు.

బుధవారం నుంచే తాత్కాలిక నిలిపివేత

25 ఏళ్లపాటు నిరవధిక సేవలందించింది జెట్​ ఎయిర్​వేస్​. కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ బుధవారం ప్రకటించింది. అత్యవసరంగా అవసరమైన రూ. 400 కోట్ల నిధులు ఇచ్చేందుకు రుణదాతలు అంగీకరించకపోవడమే ఇందుకు కారణంగా తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details