ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) దేశవ్యాప్తంగా సమ్మెకు దిగగా... బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడింది. పది లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ రెండు రోజుల సమ్మెలో పాల్గొంటుండగా ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె- ఖాతాదారులకు ఇబ్బందులు - యూఎఫ్‌బీయూ
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు తలపెట్టిన సమ్మెతో బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా సుమారు పది లక్షల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించినట్లు సమాచారం.
నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలో బడ్జెట్ సమర్పణ సందర్భంగా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తున్నట్టు ప్రకటించారు. అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మార్చి 4, 9, 10 తేదీల్లో జరిగిన రాజీ చర్చలు సానుకూల ఫలితం ఇవ్వనందున సమ్మె అనివార్యంగా మారినట్టు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు.
ఇదీ చదవండి:'ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణతో లాభాలెన్నో'
Last Updated : Mar 15, 2021, 10:40 AM IST