దేశవ్యాప్తంగా నేడూ, రేపు సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఇది వరకే వెల్లడించింది.
ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)తో ఈ నెల 13న జరిగిన వేతన సమీక్ష చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి యూనియన్లు.
దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రధాన బ్యాంకు యూనియన్ల తరఫున యూఎఫ్బీయూ ఈ చర్చల్లో పాల్గొంది.
సమ్మె నేపథ్యంలో రెండు రోజులపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఎస్బీఐ సహా పలు బ్యాంకులు సమ్మెపై ఇప్పటికే ప్రకటన చేశాయి.