తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​ బ్యాంకుతో 'బంధన్'​- రూ.300 కోట్లు పెట్టుబడి

ఎస్ బ్యాంకులో పెట్టుబడి పెట్టేందుకు మరో ప్రైవేటు బ్యాంకు ముందుకొచ్చింది. రూ.300 కోట్లతో ఎస్ బ్యాంకు షేర్లు కొనుగోలు చేయనున్నట్లు బంధన్​ బ్యాంకు ప్రకటించింది.

investment flow to yes bank
ఎస్​ బ్యాంకులో భారీ పెట్టుబడులు

By

Published : Mar 14, 2020, 5:21 PM IST

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్‌ బ్యాంకులోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా బంధన్‌ బ్యాంకు రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు తమ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. రూ.10 చొప్పున(రూ.2 ముఖ విలువున్న షేరును రూ.8 అధికంగా) మొత్తం 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లతో కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. నగదు రూపేణా ఈ లావాదేవీ జరుగుతుందని స్పష్టం చేసింది.

ఇతర బ్యాంకుల పెట్టుబడులు..

ఎస్​ బ్యాంక్​లో ఇప్పటికే 49శాతం వాటా కొనుగోలుకు రూ.7,250 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా చెరో రూ.1,000 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.600 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి. ప్రతిపాదిత ఈ లావాదేవీల అనంతరం ఎస్‌ బ్యాంక్‌లో దాదాపు 70శాతం వాటా ఈ ఐదు ఆర్థిక సంస్థల చేతిలోనే ఉండనుంది. పునరుద్ధరణ ప్రణాళిక, షేర్ల జారీ అనంతరం తుది వాటాలపై స్పష్టత వస్తుంది.

మరోవైపు ఎస్‌ బ్యాంకుపై ఈ నెల 5న ఆర్బీఐ విధించిన మారటోరియాన్ని.. 18న ఎత్తివేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రకారం ఆర్బీఐ ప్రతిపాదించిన ఎస్‌బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళిక-2020 అమల్లోకి వచ్చినట్లయింది.

ఇదీ చూడండి:మార్చి 16 నుంచి ఆన్​లైన్​ లావాదేవీలు బంద్​!

ABOUT THE AUTHOR

...view details