ఐటీ దిగ్గజం విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి త్వరలోనే వైదొలగనున్నారు అజీం ప్రేమ్‌జీ. జులై 30న పదవీ విరమణ చేయనున్నట్లు సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అజీం ప్రేమ్‌జీ తనయుడు, ప్రస్తుతం విప్రో ముఖ్య ప్రణాళికాధికారి(సీఎస్ఓ), బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిషద్ ప్రేమ్‌జీని ఆయన వారసుడిగా ప్రకటించింది.
''భారత సాంకేతిక రంగ మార్గనిర్దేశకుల్లో ఒకరు, విప్రో వ్యవస్థాపకులు అజీం ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేయనున్నారు. 53 ఏళ్ల పాటు కంపెనీ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పదవీకాలం 2019 జులై 30న ముగియనుంది. అయితే.. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫౌండర్ ఛైర్మన్‌గా బోర్డులో కొనసాగనున్నారు.''
- విప్రో అధికారిక ప్రకటన