Auto Sales: డిసెంబర్ నెలలో వాహన విక్రయాలు మిశ్రమంగా నమోదయ్యాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ, హ్యుందాయ్ విక్రయాలు 2021 డిసెంబర్లో క్షీణించాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు మాత్రం గణనీయంగా మెరుగుపడ్డాయి.
- నిస్సాన్ మోటార్, స్కోడా సేల్స్ కూడా పెరిగాయి.
- హోండా కార్స్ విక్రయాలు మాత్రం పడిపోయాయి.
- సెమీకండక్టర్ కొరత మాత్రం వాహనాల ఉత్పత్తిపైనే ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉంది.
విక్రయాలు ఇలా..
- మారుతీ సుజుకీ ఇండియా దేశీయ కార్ల విక్రయాలు 13 శాతం పతనం అయ్యాయి. 2020 డిసెంబర్లో 1,50,228 మారుతీ కార్లు అమ్ముడవగా.. 2021లో ఆ సంఖ్య 1,30,869కి పరిమితమైంది.
ఎలక్ట్రానిక్ ఉపకరణాల కొరత తమ కార్ల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపించినట్లు మారుతీ సుజుకీ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
- హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల దేశీయ విక్రయాలు ఏకంగా 32 శాతం పడిపోయాయి. 2020 డిసెంబర్లో 47,400 యూనిట్లు అమ్ముడుపోగా.. 2021లో ఆ సంఖ్య 32,312గా ఉంది.
- Tata Motors Sales: ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్ 50 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్లో ఈ సంస్థ 23 వేలకుపైగా కార్లను అమ్మగా.. 2021లో 35,299 యూనిట్లను విక్రయించింది.