తెలంగాణ

telangana

ETV Bharat / business

లొకేషన్​ విషయంలో గూగుల్​ మోసం చేస్తోందా? - బిజినెస్ వార్తలు

గూగుల్ మాప్స్​పై చర్యలకు సిద్ధమైంది ఆస్ట్రేలియా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ. యూజర్లకు తెలియకుండానే వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకోనున్నట్లు ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ వెల్లడించింది.

లొకేషన్​ విషయంలో గూగుల్​ మోసం చేస్తోందా?

By

Published : Oct 29, 2019, 4:47 PM IST

Updated : Oct 30, 2019, 7:35 AM IST

గూగుల్ మ్యాప్స్​పై ఆస్ట్రేలియా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది.

ఆడ్రాయిడ్​ ఫోన్​, టాబ్లెట్ యూజర్లకు సంబంధించి సున్నితమైన వ్యక్తిగత లోకేషన్​ సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్​ సేకరించి భద్రపరుస్తోందని ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ) పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆయా యూజర్లకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించింది.

ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్​ లొకేషన్ డేటా సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు స్మార్ట్​ఫోన్ తెరపై తక్కువ సమాచారం ఇచ్చి, యూజర్లను తప్పుదోవ పట్టించినట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో గూగుల్​కు భారీ జరిమానా విధించనున్నట్లు ఏసీసీసీ ఛైర్మన్ ఆడమ్ సీమ్స్ తెలిపారు. గూగుల్ గతంలోనూ ఇలాంటి పొరపాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారాయన. ఇప్పుడు అలాంటి పొరపాటే చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్​లో ఇలాంటి పొరపాట్లు ఉండవని గూగుల్ స్పష్టతనివ్వాలని ఆదేశించినట్లు ఆడమ్ సీమ్స్ తెలిపారు.

ఈ వివాదంపై స్పందించిన గూగుల్... వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని.. వారికి మెరుగైన సేవలు అందించేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. ఇతర అవసరాలకు ఆ సమాచారం వాడడం లేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ప్రీ పెయిడ్​.. పోస్ట్​ పెయిడ్​.. ఏ ప్లాన్​ ఉత్తమం..!

Last Updated : Oct 30, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details