తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో త్వరలో 'టెస్లా' శకారంభం! - ఎలాన్ మస్క్​

భారత మార్కెట్లోకి ప్రవేశించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​కు అశోక్ లేలాండ్ ఆహ్వానం పలికింది. మస్క్​తో కలిసి భారత్​లో ఎలక్ట్రికల్ కార్ల వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

టెస్లాతో లేలాండ్​

By

Published : May 21, 2019, 1:38 PM IST

ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజాల్లో టెస్లా పేరు తప్పక చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అమెరికాకే పరిమితమైన ఆ సంస్థ.. వ్యాపారాన్ని విస్తరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్​లో కార్యకలాపాలను భారీస్థాయిలో ప్రారంభించేందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్​ రెండేళ్లుగా ప్రణాళికలు వేస్తున్నా ఆటంకాలు ఎదురవుతూనే వచ్చాయి. ప్యూహాలేవీ కార్యరూపం దాల్చలేదు.

మస్క్​తో దోస్తీకి మేం సిద్ధం

దేశీయ వాహన రంగ దిగ్గజం అశోక్ లేలాండ్​ నుంచి టెస్లాకు తాజాగా ఆహ్వానం అందింది. ఎలాన్​ మస్క్​తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అశోక్ లేలాండ్ సీనియర్ ఉపాధ్యక్షుడు వెంకటేశ్​ నటరాజన్​ ఓ ప్రకటనలో తెలిపారు.

"మస్క్​తో కలిసి పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. భారత్​లో ఎలక్ట్రిక్ కార్ల కల సాకారానికి కేవలం ఒక్కరి భాగస్వామ్యం సరిపోదు. ఇందుకు చాలా మంది సహకారం కావాలి. ఈ ప్రయత్నంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం.
మా సంస్థ తత్వం గురించి చెప్పాలంటే.. ఏదైనా కొత్త సాంకేతికత వస్తే దాన్ని ప్రయోగించాలని భావిస్తాం. మా వినియోగదారులకు ఉపయోగపడుతుందంటే.. అది ఎలాంటిదైనా అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంటాం."
-వెంకటేశ్​ నటరాజన్​, సీనియర్ ఉపాధ్యక్షుడు అశోక్​ లేలాండ్

లేలాండ్​ బలాలివే..

ఈ ఏడాది ఏప్రిల్​లో అశోక్​ లేలాండ్​ 13,141 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. 2018లో ఇదే నెలలో నమోదైన 11,951 విక్రయాలతో పోల్చుకుంటే ఇది 10 శాతం అధికం. భారత్​లో బస్సుల తయారీలో అగ్రగామిగా ఉంది అశోక్ లేలాండ్​. అంతర్జాతీయ మార్కెట్లో నాలుగో స్థానంలో ఉంది.

అశోక్ లేలాండ్​కు ఉన్న ఏఏ రేటింగ్​ను ఏఏ ప్లస్​కు ఇటీవలే అప్​గ్రేడ్​ చేసింది రేటింగ్ ఏజెన్సీ ఇక్రా.

మస్క్​కు కలిసొచ్చే అంశం

అశోక్ లేలాండ్ ఆఫర్​ను మస్క్ కచ్చితంగా అంగీకరించే అవకాశం ఉంది.

"ఈ ఏడాది భారత్​లోకి వచ్చేందుకు ఇష్టపడుతున్నాం. ఈ సారి కుదరకపోతే కచ్చితంగా వచ్చే ఏడాది వస్తాం" అని ఎలాన్​ మస్క్ గతంలో పేర్కొన్నారు.

అడ్డంకుల వల్లే ఆలస్యం

భారత్​లో టెస్లా లేదని గతంలో ఎలాన్​ మస్క్​ను ట్విట్టర్​లో ఓ వ్యక్తి ప్రశ్నించాడు. "భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రభుత్వ విధానాలు, ఎఫ్​డీఏ నియమాలతో సవాళ్లు ఎదురవుతున్నాయి" అని మస్క్​ సమాధానమిచ్చారు.

మోడల్-3తో భారత్​లో అడుగు

మోడల్-3తో భారత మార్కెట్లోకి ప్రవేశించాలని భావిస్తోంది టెస్లా. ఏడాదికి 35,000 వేల డాలర్ల విలువైన యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తోంది.

షాంఘైలో మొదటి ప్లాంటు

వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో ప్లాంటును ప్రారంభించింది టెస్లా. అమెరికా కాకుండా వేరే దేశాల్లో స్థాపించిన మొదటి ప్లాంటు ఇదే.

షాంఘై ప్లాంటు నుంచి ఏడాదికి 500,000 ఎలక్ట్రిక్​ వాహనాలను ఉత్పత్తి చేయాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details