తెలంగాణ

telangana

ETV Bharat / business

చమురు రంగంలో కీలక సంస్కరణలకు ఆమోదం - కీలక నంస్కరణలపై కేంద్రం ఆమోదం

పెట్రోలియం రంగంలో పోటీని తట్టుకునేలా ప్రతిపాదించిన కీలక సంస్కరణలకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్​. చమురు ఉత్పత్తి చేయని సంస్థలు కూడా విక్రయాలు జరిపేలా నిబంధనలు రూపొందించింది.

చమురు రంగంలో కీలక సంస్కరణలకు ఆమోదం

By

Published : Oct 23, 2019, 8:53 PM IST

పెట్రోలియం రంగంలో కేంద్ర మంత్రివర్గం కీలక సంస్కరణలకు ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు చమురు ఉత్పత్తి సంస్థల ఆధ్వర్యంలోనే రీటైల్‌ చమురు విక్రయాలు జరుగుతుండేవి. ఈ నిబంధనల్లో మార్పులు తెస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

పోటీని తట్టుకునేలా చమురు ఉత్పత్తి చేయని సంస్థలు కూడా చిల్లర రంగంలో ఇంధన విక్రయాలు చేపట్టడానికి అనుమతించింది. తద్వారా చమురు ఉత్పత్తి చేయని సంస్థలు కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి వీలు కలగనుంది.

సిఫార్సు మేరకు..

ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు కొత్త నిబంధనలను రూపొందించింది కేంద్రం. పెట్రోల్​ పంపులను ఏర్పాటు చేసేందుకు 2వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనను సడలించింది. ఈ మేరకు 250 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు కూడా చిల్లర ఇంధన రంగంలోకి ప్రవేశించవచ్చు.

గ్రామాల్లో 5 శాతం...

అయితే 5 శాతం తమ విక్రయ కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే నిబంధనను పొందుపర్చారు. ఈ నిర్ణయం ద్వారా పెట్రోలియం రంగంలోకి పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.

చమురు రంగంలో కీలక సంస్కరణలకు ఆమోదం

"పెట్రోలియం శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాము. ప్రధాని మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్​.. ఇంధన రీటైల్​ విక్రయాల నిబంధనల మార్పును ఆమోదించింది. పెట్రోల్‌, డీజిల్‌, ఎలక్ట్రికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు, ఎల్‌.ఎన్‌.జీ, సీ.ఎన్‌.జీ సంబంధించి.. ముడి చమురు ఉత్పత్తి సంస్థలు కాని కంపెనీలు కూడా వ్యాపారాలను ప్రారంభించవచ్చు. దీని వల్ల పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయి. ఉత్పత్తి పెరుగుతుంది. కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి. సేవలు కూడా ఉత్తమంగా మారుతాయి. సులభతర వ్యాపారం సహా అన్ని అంశాల పరంగా ఇది చాలా గొప్ప నిర్ణయం."

-ప్రకాశ్‌ జావడేకర్‌, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details