నూతన ఐటీ నిబంధనల ప్రకారం.. చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్(సీసీఓ), రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్(ఆర్జీఓ), నోడల్ కాంటాక్ట్ అధికారులుగా శాశ్వత ఉద్యోగులను నియమించినట్లు దిల్లీ హైకోర్టుకు సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ శుక్రవారం తెలిపింది. అయితే... ఈ మేరకు ట్విట్టర్ దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో సరైన వివరాలు లేవని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ వివరాలన్నీ ఉండేలా చూడాలని తెలిపింది. ఈమేరకు ప్రమాణ పత్రం కాపీలను కేంద్ర కౌన్సిల్ సహా ఇతర కక్షిదారులకు అందజేసినట్లు జస్టిస్ రేఖా పల్లి పేర్కొన్నారు.
సీసీఓ, ఆర్జీఓ, నోడల్ అధికారి పదవుల కోసం శాశ్వత అధికారులను నియమించామని ట్విట్టర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య.. కోర్టుకు నివేదించారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు 4నే ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రమాణపత్రం దాఖలు చేశారు.
నిబంధనలు పాటించారా?