ప్రముఖ లగ్జరీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ యాపిల్.. భారత్‌లో తొలి అధికారిక ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెల 23న భారత్‌లో ఆన్లైన్ స్టోర్ అందుబాటులోకి రానున్నట్లు సంస్థ సీఈఓ టిక్‌కుక్ ట్విట్టర్లో ప్రకటించారు. యాపిల్‌కు చెందిన అన్ని రకాల ఉత్పత్తులు ఆన్లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
వినియోగదారుల సౌలభ్యం కోసం ఆన్లైన్ సపోర్ట్ సేవలను కూడా తీసుకురానున్నట్లు వెల్లడించింది యాపిల్. ప్రోడక్ట్‌ల వివరాలు, మ్యాక్ కస్టమ్ కాన్ఫిగరింగ్ వంటి వాటి సహాయానికి ఈ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో కస్టమర్ సపోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది.
ప్రత్యేక ఆఫర్లు..
విద్యార్థుల కోసం మ్యాక్‌బుక్, ఐప్యాడ్స్, యాపిల్ర్+ సహా పలు ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్ అందించనున్నట్లు యాపిల్ ప్రకటిచింది.