గ్యాడ్జెట్ దిగ్గజం యాపిల్ తన 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోలో సరికొత్త మార్పులు చేసింది. ఇందులో రెటీనా తెర, ఎస్కేప్ కీ, టచ్ బార్, టచ్ ఐడీ, డబుల్ స్టోరేజీ, మ్యాజిక్ కీబోర్డు వంటి అనేక ఫీచర్లను అందిస్తోంది.
ఈ మ్యాక్‌బుక్ శ్రేణిలోనూ అధునాతమైన 10వ తరం ప్రాసెసర్లనే ఉపయోగించింది యాపిల్. ఇందులో 4.1 గిగా హెట్జ్ టర్బో బూస్ట్ స్పీడ్ ఇంటెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్లను వాడింది. 80 శాతం వేగవంతమైన గ్రాఫిక్స్‌తో పాటు 3733 మెగా హెట్జ్ సామర్థ్యం కలిగిన 16జీబీ స్టోరేజీని అందిస్తోంది. వినియోగదారులు 32 జీబీ స్టోరేజీని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.
మ్యాజిక్ కీబోర్డు..
వినియోగదారులకు మంచి టైపింగ్ అనుభవం కల్పించేందుకు మ్యాజిక్ కీబోర్డును తీసుకొచ్చామని మ్యాక్, ఐప్యాడ్ ఉత్పత్తుల మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ టామ్ బోజర్ తెలిపారు.