ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ భారత్‌లో త్వరలోనే అధికారిక ఆన్లైన్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల ఆరంభంలో దేశంలో యాపిల్ తన ఆన్లైన్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించే అవకాశం ఉందని బ్లామ్‌బర్గ్ నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయంపై యాపిల్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
నిజానికి యాపిల్ ఆన్లైన్ స్టోర్ ఇదివరకే ప్రారంభం కావాల్సి ఉంది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల కారణంగా అందులో జాప్యం జరిగింది.
దేశంలో త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ మార్కెట్‌ను అందిపుచ్చుకునేందుకు ఇప్పుడు మళ్లీ ఆ దిశగా యాపిల్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ప్రస్తుతం భారత్‌లో థర్డ్ పార్టీ రిటైలర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
భారత్‌లో ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ను వచ్చే ఏడాది ముంబయిలో ప్రారంభించనున్నట్లు.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇదివరకే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి:ఎయిర్ ఇండియా విక్రయానికి మళ్లీ గడువు పెంపు