తెలంగాణ

telangana

ETV Bharat / business

యాపిల్​ దెబ్బకు నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ విలవిల! - నెట్​ఫ్లిక్స్

'టీవీ ఫ్లస్'​ సేవలతో.. వీడియో ఆన్ డిమాండ్​ సేవల దిగ్గజాలు నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​లకు గట్టి పోటీ ఇచ్చేందుకు యాపిల్ సిద్ధమైంది. ఈ రెండు ఓటీటీ సంస్థల సేవల నెలవారీ ప్రీమియం చందాలో సగం కన్నా తక్కువ ధరకే టీవీ ప్లస్​ సేవలు అందించనున్నట్లు యాపిల్​ ప్రకటించింది.

యాపిల్

By

Published : Sep 11, 2019, 4:29 PM IST

Updated : Sep 30, 2019, 6:04 AM IST

ఎప్పటినుంచో ఊరిస్తున్న 'యాపిల్​ టీవీ ప్లస్​' సేవలను ఎట్టకేలకు ఆవిష్కరించింది ఎలక్ట్రానిక్​ దిగ్గజం యాపిల్​. ఈ సేవల ప్రారంభంతో ఓటీటీ సేవల మార్కెట్​లో అగ్రగామిగా దూసుకుపోతున్న నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​లకు యాపిల్​ గట్టి పోటీ ఇవ్వనుంది.

టీవీ ప్లస్ సేవల నెలవారీ చందా 5 డాలర్లుగా నిర్ణయించింది​ యాపిల్.​ ఈ​ నెలవారీ చందా నెట్​ఫ్లిక్స్​తో పోలిస్తే సగం కన్నా తక్కువ. నెట్​ఫ్లిక్స్ నెలవారీ చందా 13 డాలర్లుగా ఉంది. అమెజాన్ ప్రైమ్ నెలవారీ చందా 9 డాలర్లు మాత్రమే.

ఇదే సమయంలో నెట్​ఫ్లిక్స్​కు పోటీగా మరో దిగ్గజ సంస్థ వాల్ట్​ డిస్నీ తన వీడియో సేవలను నవంబర్​ నుంచే తీసుకు రానున్నట్లు తెలిపింది. వాల్ట్​​ డిస్నీ ప్రీమియంను నెలకు 7 డాలర్లుగా నిర్ణయించింది.

యాపిల్ టీవీ ప్లస్​తో పాటు.. యాపిల్​ ఆర్కేడ్​ పేరుతో వీడియో గేమ్​లు ఆడుకునే సదుపాయాన్ని యాపిల్​ ఆవిష్కరించింది. ఈ సేవలు వినియోగించుకునేందుకు నెలకు 5 డాలర్ల చందాను వసూలు చేయనున్నట్లు తెలిపింది. యాపిల్ ఆర్కేడ్​ సేవలు నవంబర్​ 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఇదీ చూడండి: అజిమ్​ ప్రేమ్​జీ నుంచి 1.22 కోట్ల షేర్ల బైబ్యాక్!

Last Updated : Sep 30, 2019, 6:04 AM IST

ABOUT THE AUTHOR

...view details