తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'ఆపిల్' - ఆపిల్ త్రైమాసికంలో లాభాలు

ఆపిల్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. జూన్​తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ మెరుగైన పనితీరుతో ఆపిల్ షేర్లకు రెక్కలొచ్చాయి. షేర్లు 10 శాతానికిపైగా వృద్ధి చెందడం వల్ల సౌదీ ఆరామ్​కోను అధిగమించింది ఆపిల్.

apple-surpassed-saudi-aramco-to-become-the-worlds-most-valuable-company
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'ఆపిల్'

By

Published : Aug 1, 2020, 4:27 PM IST

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అమెరికాకు చెందిన దిగ్గజ సాంకేతిక సంస్థ ఆపిల్ అవతరించింది. జూన్ త్రైమాసికంలో గణనీయమైన రాబడులు సాధించడం వల్ల ఆపిల్ షేరు షేరు విలువ 10.47 శాతం ఎగబాకింది. మొత్తంగా ఈ సంవత్సరం షేరు విలువ 44 శాతం పెరిగింది.

ఫలితంగా 1.84 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ పెట్టుబడితో సౌదీకి చెందిన ఆరామ్​కో కంపెనీని అధిగమించి మోస్ట్ వ్యాల్యుయేబుల్ పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా ఆవిర్భవించింది ఆపిల్. ప్రస్తుతం సౌదీ ఆరామ్​కో విలువ 1.76 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

"జూన్ త్రైమాసికంలో సంస్థ వస్తు, సేవల ఉత్పత్తిలో రెండంకెల వృద్ధి నమోదు చేసింది. మా ప్రతీ ఒక్క భౌగోళిక ప్రాంతాల్లో వృద్ధి నమోదైంది. మా వినియోగదారుల జీవితంలో ఆపిల్ ఉత్పత్తులు పోషిస్తున్న పాత్రకు అనిశ్చితి సమయంలో వచ్చిన ఫలితాలే నిదర్శనం."

-టిమ్ కుక్, ఆపిల్ సీఈఓ

2020 జూన్ 27తో ముగిసిన త్రైమాసికంలో 59.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది ఆపిల్. ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే ఇది 11 శాతం పెరుగుదల. ఈ త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాల ద్వారా 26.4 బిలియన్ డాలర్లు, ఐపాడ్ విక్రయాల ద్వారా 6.6 బిలియన్ డాలర్లను ఆపిల్ సంపాదించింది. మాక్​ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా 7.1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.

బోనస్ షేర్లు

వాల్​స్ట్రీట్ అంచనాలను మించి ఐఫోన్ల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. అనూహ్య ఫలితాలు సాధించిన ఆపిల్.. తన పెట్టుబడిదారులకు తీపికబురు చెప్పింది. నాలుగు షేర్లకు ఒక అదనపు షేరును అందించేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 నుంచి ఇది అమలులోకి రానుంది.

ఇదీ చదవండి:2జీ సేవలను చరిత్రలో కలిపేయాలి: అంబానీ

ABOUT THE AUTHOR

...view details