తెలంగాణ

telangana

ETV Bharat / business

స్మార్ట్​ఫోన్ల​ ధరలు పెంపు- కొత్త లెక్కలు ఇవే... - realme

భారత్​లో మొబైల్ ఫోన్ల ధరలను సవరిస్తున్నట్లు ప్రకటించాయి రియల్​మీ, యాపిల్​​ సంస్థలు. పెరిగిన జీఎస్టీ రేట్లకు అనుగుణంగా ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేశాయి. ఏప్రిల్​ 1 నుంచే నూతన ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించాయి.

Realme smartphones get costly after GST hike
స్మార్ట్​ఫోన్ల​ ధరలు పెరిగాయి.. కొత్త ధరలు ఎలా ఎంతంటే..

By

Published : Apr 2, 2020, 11:40 AM IST

భారత్​లో మొబైల్ ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి రియల్​మీ, యాపిల్​​ సంస్థలు. ఏప్రిల్​ 1 నుంచే నూతన ధరలు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించాయి.

కరోనా, జీఎస్టీ కారణంగానే...

కరోనా సంక్షోభంతో ఇప్పటికే ఫోన్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఇలా ఏర్పడుతున్న కొరతకు తోడు... స్మార్ట్​ఫోన్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశంలో మొబైల్​ ధరలకు రెక్కలొస్తున్నాయి. రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తున్నందున ప్రముఖ స్మార్ట్​ఫోన్ సంస్థలు ధరల పెంపునకు మొగ్గుచూపుతున్నాయి. యాపిల్​తో పాటు ​చైనా స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రియల్​మీ ఇదే దారిని అనుసరించాయి.

పెరిగిన రియల్​మీ ధరలు ఇలా

రియల్​మీ దాదాపు ప్రతి మోడల్​పై రూ.1000 పెంచింది.

మోడల్​ పాత ధర నూతన ధర
రియల్​మీ 6 (4జీబీ+64జీబీ) రూ.12,999 రూ.13,999
రియల్​మీ ఎక్స్​2 (4జీబీ+64జీబీ) రూ.16,999 రూ.17,999
రియల్​మీ ఎక్స్​టీ (4జీబీ+64జీబీ) రూ.15,999 రూ.16,999

ఐఫోన్​ ధరలు ఇలా..

ఐఫోన్​ నూతన ధరలను మోడల్​ను బట్టి నిర్ణయించింది యాపిల్​ సంస్థ.

మోడల్​ పాత ధర నూతన ధర
ఐఫోన్ 11 (64 జీబీ) రూ.64,900 రూ.68,300
ఐఫోన్​ ఎక్స్ఆర్​ (64 జీబీ) రూ.49,900 రూ.52,500
ఐఫోన్​ 11ప్రో (64 జీబీ) రూ.1,01,200 రూ.1,06,600
ఐఫోన్​ 11 మ్యాక్స్​ (64 జీబీ) రూ.1,11,200 రూ.1,17,100
ఐఫోన్​ 7 (32 జీబీ) రూ.29,900 రూ.31,500

ABOUT THE AUTHOR

...view details