భారత్‌లో ఐ ఫోన్ల ధరలు భారీగా తగ్గించింది యాపిల్. ఇటీవలే యాపిల్ సంస్థ ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రోమ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో గతేడాది విడుదల చేసిన ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఎక్స్‌ఎస్ సహా ఇతర మోడళ్ల ధరలను యాపిల్ సంస్థ భారత్‌లో తగ్గించింది. ఓ జాతీయ టెక్ వార్తా సంస్థ వివరాల ప్రకారం వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ఏ మోడల్ ధర ఎంత తగ్గిందంటే..
గతేడాది ఆవిష్కరణ సమయంలో ఐఫోన్ ఎక్స్‌ఆర్ ధర భారత్‌లో రూ.76,900 ఉండగా..ఇప్పుడు రూ.49,900లకు తగ్గించారు. గత ఏడాది రూ.99,900గా ఉన్న ఎక్స్‌ఎస్ ధర ఇప్పుడు రూ.89,900 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ ఎక్స్‌ఆర్ 64జీబీ వేరియంట్ రూ.49,900.. 128 జీబీ ధర రూ.54,900గా మార్చారు. ఎక్స్‌ఎస్ 256 జీబీ ధర 1,03,900కు తగ్గించారు. తొలుత దీని ధర రూ.1,14,900గా ఉండేది.
ఐఫోన్ 8ప్లస్ 64 జీబీ రూ.49,900లకు, ఐఫోన్ 8.. 64జీబీ వేరియంట్‌ను రూ.39,900లకు పొందవచ్చు. మరింత పాత మోడల్ అయిన ఐఫోన్ 7 32జీబీ, 128 జీబీ ధరలు వరుసగా రూ.29,900.. రూ.34,900కు తగ్గించింది యాపిల్. 7ప్లస్ ధరలు రూ.37,900 (32జీబీ) రూ.42,900 (128 జీబీ)గా ఉన్నాయి. అయితే ఐఫోన్ ఎక్స్, ఎక్స్‌ఎస్ మ్యాక్స్ ధరలను మాత్రం యథాతథంగానే ఉంచారు. తగ్గించిన ధరలు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయనే విషయం తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: రూపాయికే 4 ఇడ్లీల కమలాత్తాళ్‌కు మహీంద్రా భరోసా