తెలంగాణ

telangana

ETV Bharat / business

వీడియో స్ట్రీమింగ్​ సేవలను ప్రారంభించిన యాపిల్​​ - యాపిల్​ న్యూస్​ ప్లస్​

ప్రముఖ స్మార్ట్​ ఫోన్, కంప్యూటర్​ తయారీ సంస్థ యాపిల్​ ఇప్పుడు  వీడియో సేవలనూ ప్రారంభించింది. మేగజీన్లు, వార్తా పత్రికలను అందించే 'యాపిల్​ న్యూస్​ప్లస్'​ను సరికొత్త సబ్​స్క్రిప్షన్​ ప్యాకేజీతో అందిస్తోంది. అంతేకాకుండా గేమింగ్​ సేవలనూ విస్తరించింది యాపిల్.

యాపిల్​​

By

Published : Mar 26, 2019, 5:20 PM IST

Updated : Mar 26, 2019, 7:04 PM IST

యాపిల్​ నూతన సేవలను వివరిస్తున్నటిమ్​ కుక్​
ప్రముఖ టెక్​ దిగ్గజం యాపిల్​ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వీడియో స్ట్రీమింగ్​ సేవలను ఆ సంస్థ ఆవిష్కరించింది.కాలిఫోర్నియాలోని యాపిల్​ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాపిల్​ ఈ ప్రకటన చేసింది.

స్మార్ట్​ఫోన్ల అమ్మకాలు ఇటీవల తగ్గుముఖం పట్టిన కారణంగా యాపిల్​ ఇతర సేవలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా డిజిటల్ కంటెంట్​ను అందుబాటులోకి తెచ్చింది ఈ టెక్​ దిగ్గజం.

ఇవేకాక 'యాపిల్​ న్యూస్​ ప్లస్'​, గేమింగ్ కోసం 'యాపిల్​ ఆర్కేడ్​' సేవలను అందుబాటులోకి తెచ్చింది ఐ ఫోన్​ తయారీ సంస్థ.

ప్రకటనలు లేకుండా అందించే.. 'యాపిల్​ టీవీ ప్లస్​' సేవలను కూడా ఈ ఏడాదిలో 100 దేశాల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈ సర్వీసులు చందాదార్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇందులో డిజిటల్​ కంటెంట్​ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది యాపిల్.

ఈ నిర్ణయంతో ఇప్పటికే వీడియో సేవల్లో దూసుకుపోతున్న నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​, హులు వంటి సంస్థలతో పోటీకి సిద్ధమైంది. వాటితో పోలిస్తే సొంత కంటెట్​పై యాపిల్​ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.

న్యూస్​ ప్లస్​ సేవలను అమెరికా, కెనడాల్లో అందుబాటులోకి తెచ్చింది యాపిల్​. ఆంగ్ల, ఫ్రెంచ్​ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి బ్రిటన్​, ఆస్ట్రేలియాల్లో ఈ సేవలను తీసుకురానున్నట్టు వెల్లడించింది. నెలకు 9.99 డాలర్ల నెలసరి చందాతో ఈ సేవలు అందించనుంది యాపిల్.

ఫోన్లు సహా ఇతర డివైజ్​ల కోసం 'యాపిల్​ ఆర్కేడ్​' పేరుతో గేమింగ్ సేవలను ప్రారంభించింది యాపిల్. వివిధ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్ల​తో వీటిని అందుబాటులోకి తెస్తామని, ధరలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.

"సృజనాత్మకత శక్తిని మేము బలంగా నమ్ముతాం. గొప్ప కథలు ప్రపంచాన్ని మారుస్తాయి. ఏదైనా కొత్తగా చేసి మన సమాజానికి, సంస్కృతికి ముఖ్యమైనది అందివ్వాలని భావిస్తున్నాం " - నూతన సర్వీసుల ఆవిష్కరణ కార్యక్రమంలోయాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​

ప్రకటనకర్తలు చందాదారుల వాడుక విధానాన్ని గుర్తించలేరని, ఇది పటిష్టమైన గోప్యతతో కూడిందని యాపిల్​ పేర్కొంది.

అదనపు సేవల్లో భాగంగా గోల్డ్​ మన్ శాక్స్​తో కలిసి క్రెడిట్​ కార్డ్​ సేవలను యాపిల్​ పే ద్వారా అందిస్తున్నట్లు సంస్థ​ వెల్లడించింది. అమెరికాలో ఈ డిజిటల్​ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు యాపిల్​ తెలిపింది.

Last Updated : Mar 26, 2019, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details