తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​ లక్ష్యంగా యాపిల్ నుంచి రెండు బడ్జెట్​ ఫోన్లు! - యాపిల్ స్మార్ట్​ఫోన్​ న్యూస్​

భారత మార్కెట్ లక్ష్యంగా ఈ ఏడాది రెండు కొత్త ఐఫోన్​ మోడళ్లను తీసుకువచ్చేందుకు యాపిల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2020లో మొత్తం 6 ఐఫోన్​ మోడళ్లను తీసుకురానున్నట్లు సమాచారం.

IPHOEN
యాపిల్​

By

Published : Jan 4, 2020, 12:00 PM IST

లగ్జరీ గాడ్జెట్స్​ తయారీ సంస్థ యాపిల్ ఈ ఏడాది భారీగా కొత్త మోడల్ ఐఫోన్లను తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పలు టెక్​ వార్తా సంస్థల ప్రకారం ఈ ఏడాది మొత్తం 6 ఐఫోన్లను​ మార్కెట్లోకి తెచ్చేందుకు యాపిల్​ ప్రణాళికలు చేస్తోంది. విశేషమేంటంటే.. వీటిలో రెండు మోడళ్లు సరసమైన ధరల్లో అందుబాటులోకి రానున్నాయి.

నాలుగు ప్రీమియం మోడళ్లు ఓఎల్​ఈడీ తెర.. తక్కువ ధర మోడళ్లలో ఎల్​​సీడీ డిస్​ప్లేలను కలిగి ఉండే అవకాశముంది.

తక్కువ ధర ఫోన్లు ఎలా ఉండనున్నాయంటే..

యాపిల్ వర్గాల సమాచారం ప్రకారం.. ఎస్​ఈ సిరీస్​ కొనసాగింపులో భాగంగా రెండు బడ్జెట్​ ఫోన్లను తీసుకురానుంది. ఇందులో ఒకటి 5.5 అంగుళాలు, మరొకటి 6.1 అంగుళాల తెరతో రానున్నాయి.ఇంతకు ముందూ.. యాపిల్​ 2020లో 5 ఐఫోన్​ మోడళ్లను తీసుకురానుందనే వార్తలొచ్చాయి. వాటిలో కనీసం రెండు మోడళ్లు 5జీ వేరియంట్లు.. వేరు వేరు ధరల సెగ్మెంట్​లో రానున్నట్లు అవి పేర్కొన్నాయి.

యాపిల్ సంస్థ కూడా..

ఐఫోన్​ ఎస్​ఈకి కొనసాగింపుగా మిడ్​ రేంజ్​లో ఓ మోడల్​ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. అయితే తాజా సమాచారం ప్రకారం మిడ్​ రేంజ్​లో రెండు స్మార్ట్​ ఫోన్లను తీసుకురాన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. ఐఫోన్​ ఎస్​ఈకి కొనసాగింపుగా ఐఫోన్​ 9, ఐఫోన్​ 9ప్రో పేరుతో రానున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది పలు కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ భారత మార్కెట్లో యాపిల్​కు ఏ మేరకు దోహదం చేస్తాయో వేచి చూడాలి.

ఇదీ చూడండి:2636 ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్​సిగ్నల్​

ABOUT THE AUTHOR

...view details