తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో 'ఐఫోన్​ ఎక్స్​ఆర్'​ మొబైల్​ తయారీ షురూ!

మేక్​ ఇన్​ ఇండియాలో భాగంగా భారత్​లో తయారీని ప్రోత్సహిస్తోంది కేంద్రం. ఈ క్రమంలో మొబైల్​ తయారీ రంగంలో కీలక ముందడుగు పడింది. టెక్​ దిగ్గజం యాపిల్​.. భారత్​లో 'ఐఫోన్​ ఎక్స్​ఆర్​' మొబైల్​ తయారీని ప్రారంభించనుంది. ఛార్జర్లు, ఇతర మొబైల్​ సంబంధిత వస్తువులను తయారు చేసే సాల్కాంప్​ సంస్థకు చెన్నైలో నోకియాకు చెందిన సెజ్​ను అప్పగిస్తూ.. కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్​లో 'ఐఫోన్​ ఎక్స్​ఆర్'​ మొబైల్​ తయారీ షురూ

By

Published : Nov 25, 2019, 6:59 PM IST

దేశంలో మొబైల్​ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా టెక్​ దిగ్గజం యాపిల్​.. భారత్​లో 'ఐఫోన్​ ఎక్స్​ఆర్' ఫోన్ల​ ఉత్పత్తిని ప్రారంభించింది.

సాల్కాంప్​ చేతికి నోకియా..

ఇందులో భాగంగా యాపిల్​ సంస్థకు ఛార్జర్లు సరఫరా చేస్తోన్న సాల్కాంప్​తో​.. కీలక ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి. చెన్నై సమీపంలో నోకియాకు చెందిన సెజ్​ను సాల్కాంప్​కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

నోకియాకు చెందిన యూనిట్​ సుమారు 10 ఏళ్ల క్రితం మూతపడింది. దీనిని సాల్కాంప్​ తెరవనుంది. ఇందులో ఛార్జర్లు, ఇతర వస్తువులను తయారు చేయనుండగా.. 2020 నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపింది సాల్కాంప్​. ఈ యూనిట్​పై వచ్చే ఐదేళ్లలో రూ.2వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది.

" పదేళ్ల క్రితం మూతపడిన నోకియాకు చెందిన అతిపెద్ద సెజ్​ తిరిగి తెరుచుకోనుంది. ఇందులో ప్రత్యక్షంగా సుమారు 10వేల మందికి ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా మరో 50వేల మందికి ఉపాధి లభించనుంది. భారత మొబైల్​, దాని అనుబంధ వస్తువుల ఎగుమతి 2019-20 ఆర్థిక సంవత్సరానికి 1.6 బిలియన్​ డాలర్లకు చేరనుంది."

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి.

ఇదీ చూడండి: ఉంటుందా.. ఊడుతుందా? ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన

ABOUT THE AUTHOR

...view details