తెలంగాణ

telangana

ETV Bharat / business

యాపిల్ నుంచి 3 కొత్త ఫోన్లు.. ధరెంతో తెలుసా!

ఎలక్ట్రానిక్​ దిగ్గజం యాపిల్ త్వరలో మూడు కొత్త ఐఫోన్​ మోడళ్లను అవిష్కరించనుంది. ఐ ఫోన్ ఎక్స్​ఆర్​, ఎక్స్​ఎస్, ఎక్స్ఎస్ మ్యాక్స్​లకు కొనసాగింపుగా ఈ కొత్త మోడళ్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

యాపిల్

By

Published : Sep 10, 2019, 3:55 PM IST

Updated : Sep 30, 2019, 3:26 AM IST

గత సంవత్సరంలానే ఈ ఏడాదీ ఒకేసారి మూడు ఐఫోన్ మోడళ్లను అవిష్కరించేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. ఫోన్లతో పాటు నెట్​ఫ్లిక్స్​ లాంటి వీడియో సేవల ప్రారంభంపై కసరత్తు చేస్తోంది. మంగళవారం జరగనున్న వార్షిక హార్డ్​వేర్​ ప్రదర్శనలో కొత్త ఐఫోన్ మోడళ్ల వివరాలు వెల్లడించనుంది యాపిల్​. ఈ కార్యక్రమంలోనే వీడియో సేవలపైనా స్పష్టత రానుంది.

గత ఏడాది ఆవిష్కరించిన ఐఫోన్ ఎక్స్​ఆర్, ఎక్స్​ఎస్​, ఎక్స్ఎస్ మ్యాక్స్​​లకు కొనసాగింపుగా ఈ కొత్త మోడళ్లు వచ్చే అవకాశముంది. వీటి ధర 750 డాలర్ల నుంచి 1,100 డాలర్ల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

యాపిల్​ కొత్త మోడళ్లను తీసుకువస్తున్నప్పటికీ.. వాటి ఫీచర్ల విషయంలో కొత్తదనం ఉండటంలేదనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మోడళ్లను సరికొత్త ఫీచర్లతో తీసుకువచ్చే అవకాశముందని టెక్ విశ్లేషకుల అంచనా.

ముఖ్యంగా కెమెరాల విషయంలో యాపిల్ భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. గత మోడళ్లతో పోలిస్తే.. కొత్త మోడళ్లన్నీ అదనపు కెమెరాతో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జూమింగ్ కోసం టెలిఫోటోలెన్స్​ను వాడుతోంది యాపిల్. ఇప్పుడు దూరంగా ఉన్న దృశ్యాలు చిత్రీకరించేందుకు వైడ్​ యాంగిల్ లెన్స్​ను ఐఫోన్ కెమెరాల్లో నిక్షిప్తం చేసినట్లు టెక్​ వర్గాలు అంటున్నాయి.

ఈ సరికొత్త ఫీచర్లు తెచ్చినప్పటికీ.. ప్రధాన ప్రత్యర్థులైన శాంసంగ్​, హువావే, లేనోవో, గూగుల్​లతో గట్టి పోటీ ఉండనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: 'అలీబాబా' ఛైర్మన్ పదవికి జాక్​ మా వీడ్కోలు

Last Updated : Sep 30, 2019, 3:26 AM IST

ABOUT THE AUTHOR

...view details