చౌకధరలో ఒక ఐఫోన్‌ను విడుదల చేయాలని అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెల (ఫిబ్రవరి)లోనే దీని తయారీ చేపట్టాలని, మార్చిలో విడుదల చేయాలన్నది సంస్థ ప్రణాళికగా, ఈ అంశంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించినట్లు వార్తాసంస్థ బ్లూంబర్గ్ తెలిపింది. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ విపణిలో మరింత వాటా చేజిక్కించుకునేందుకు ఈ పరిణామం దోహద పడుతుందని సంస్థ భావిస్తోంది.
ఈ కొత్త ఫోన్ తయారీ పనులను విభజించి, తైవాన్‌కు చెందిన హాన్‌హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ, పెట్రాన్ కార్పొరేషన్, విస్ట్రన్ కార్పొరేషన్‌లకు అప్పగించినట్లు చెబుతున్నారు. ఐఫోన్ ఎస్‌ఈ తర్వాత ఇది తక్కువ ధర ఐఫోన్‌గా పేర్కొంటున్నారు.