ఇంటర్నెట్ డౌన్‌లోడ్ వేగంలో రిలయన్స్ జియో మరో రికార్డు సొంతం చేసుకుంది. 2019 సెప్టెంబర్‌కి సంబంధించి టెలికాం సంస్థల ఇంటర్నెట్ అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాల్ని భారత టెలికాం నియంత్రణ సంస్థ విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం రిలయన్స్ జియో 21 ఎంబీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో నిలిచింది.
జియో ప్రధాన పోటీదారు ఎయిర్‌టెల్‌తో పోలిస్తే జియో డౌన్‌లోడ్ వేగం 2.5 రెట్లు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. ఎయిర్‌టెల్ 8.3 ఎంబీపీఎస్ వేగాన్ని అందిస్తుండగా వొడాఫోన్ 6.9 ఎంబీపీఎస్, ఐడియా 6.4ఎంబీపీఎస్వేగం నమోదైనట్లు పేర్కొంది.