కరోనా వ్యాక్సిన్ తయారీ రేసులో మరో సంస్థ చేరింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మెర్క్ అండ్ కార్పొరేషన్ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. అందుకోసం వలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. వీ-591 పేరిట తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ప్రయోగం కోసం బెల్జియంలో 260 మంది వలంటీర్లను తీసుకోనుంది.
'మీజిల్స్' వైరస్‌ను రూపాంతరం చెందించి కరోనా వైరస్ పుట్టించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచే పద్ధతిని ఇందులో అవలంబిస్తున్నారు.
ఇతర టీకాలు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇప్పటికే పలు సంస్థలు అడ్వాన్స్‌డ్ స్టేజికి వెళ్లాయి. మోడెర్నా, ఫైజర్, ఆస్ట్రాజెనెకా వంటి సంస్థలు ఇప్పటికే తుది దశలో ఉన్నాయి. తాజాగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలు నిలిచిపోయినప్పటికీ త్వరలోనే తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
'ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనీషియేటివ్'తో కలిసి మెర్క్ మరో వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఎబోలా వ్యాక్సిన్ ‘ఎర్వెబో’ అభివృద్ధికి ఉపయోగించిన పద్ధతినే దీనిలోనూ అవలంబించనున్నారు. దీని క్లినికల్ ట్రయల్స్ వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఇదీ చూడండి:ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మూడోదశ ట్రయల్స్ నిలిపివేత!